ఆర్పీ కామెడీ మానేసి… డైరెక్షన్ అంటున్నాడు!!
జబర్దస్త్ ద్వారా కమెడియన్ గా పరిచయమైన ఆర్పీ.. జబర్దస్త్ టీం లీడర్ గా ఓ స్థాయి కి చేరుకున్నాడు. బుల్లితెర మీదే కాదు.. వెండితెర మీద కూడా [more]
జబర్దస్త్ ద్వారా కమెడియన్ గా పరిచయమైన ఆర్పీ.. జబర్దస్త్ టీం లీడర్ గా ఓ స్థాయి కి చేరుకున్నాడు. బుల్లితెర మీదే కాదు.. వెండితెర మీద కూడా [more]
జబర్దస్త్ ద్వారా కమెడియన్ గా పరిచయమైన ఆర్పీ.. జబర్దస్త్ టీం లీడర్ గా ఓ స్థాయి కి చేరుకున్నాడు. బుల్లితెర మీదే కాదు.. వెండితెర మీద కూడా కామెడీ చేస్తున్న ఆర్పీ నాగబాబు కోసం జబర్దస్త్ ని వదిలేసి.. జీ ఛానల్ లో అదిరింది కామెడీ షో కి వెళ్ళిపోయాడు. జబర్దస్త్ అన్నం పెట్టింది ఆ షో ఎందుకు వదిలేశారంటే.. జబర్దస్త్ లో ఉంటె ఎప్పటికి అనుకున్న గుర్తింపు రాదు… మేము కష్టపడితేనే ఛాన్స్ లు వచ్చాయి కానీ.. వాళ్ళేం పిలిచి ఛాన్స్ ఇవ్వలేదు.. మా టాలెంట్ ని వాడుకుని సొమ్ము చేసుకున్నారు అంటూ జబర్దస్త్ మీద సంచలన వ్యాఖ్యలు చేసిన ఆర్పీ.. అదిరింది షో లో కామెడీ చేసినా అక్కడ సరైన గుర్తింపు రాలేదు.
అందుకే కిర్రాక్ ఆర్పీ మెగా ఫోన్ పట్టాలని డిసైడ్ అయ్యాడట. తనని నమ్మి ఓ నిర్మాత ఓ సినిమాని నిర్మిస్తానని చెప్పడంతో కిర్రాక్ ఆర్పీ ఓ సినిమాని డైరెక్ట్ చెయ్యాలని డిసైడ్ అయ్యాడట. ఇప్పటికే కథ కూడా సిద్ధం చేసుకున్నాడట ఆర్పీ. అసలు తను ఇండస్ట్రీకి వచ్చింది దర్శకుడు కావాలనే అంటూ ముందు నుంచి చెబుతున్న ఆర్పీ ఇన్నాళ్ళకి డైరెక్షన్ ఛాన్స్ వచ్చింది అని అంటున్నాడు. ఇక కథ తనదే, స్క్రీన్ ప్లే తనదే, డైరెక్టన్ తనదే. అంటే కథ – స్క్రీన్ ప్లే – డైరెక్షన్ ఆర్పీ అంటూ వెండితెర మీద అతి త్వరలోనే కిర్రాక్ ఆర్పీ పేరుని మనం చూడబోతున్నాం అన్నమాట.
- Tags
- Kirrak RP