Sun Jul 20 2025 07:15:54 GMT+0000 (Coordinated Universal Time)
Vijay Devarakonda : రౌడీ హీరో ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్... కొత్త ప్రాజెక్టుతో విజయ్ దేవరకొండ
రౌడీ హీరో విజయ్ దేవరకొండ కొత్త సినిమా ప్రాజెక్టు రెడీ అయిం

రౌడీ హీరో విజయ్ దేవరకొండ కొత్త సినిమా ప్రాజెక్టు రెడీ అయింది. విజయ్ దేవరకొండకు గత కొన్ని రోజుల నుంచి హిట్ లేక కొంత ఇబ్బంది పడుతున్నారు. విజయ్ దేవరకొండకు స్పెషల్ ఫ్యాన్స్ ఉన్నారు. ప్రస్తుతం కింగ్ డమ్ షూటింగ్ పూర్తి చేసి రిలీజ్ కు సిద్ధంగా ఉంది. మరొకవైపు విజయ్ దేవరకొండకు ఈసారి హిట్ తో ముందుకు వస్తారని అభిమానులు భావిస్తున్నారు. కింగ్ డమ్ మూవీతో సూపర్ డూపర్ హిట్ కొట్టడం ఖాయమని మేకర్స్ కూడా చెబుతున్నారు. విజయ్ దేవరకొండకు భారీ మార్కెట్ ఉండటంతో కింగ్ డమ్ మూవీకి బజ్ పెరిగింది.
కింగ్ డమ్ తర్వాత...
ఇక కింగ్ డమ్ మూవీ షూటింగ్ పూర్తి కావడంతో కొత్త ప్రాజెక్టులో నటించేందుకు రెడీ అవుతున్నారు. అయితే కొత్త మూవీకి రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం వహిస్తున్నాడు. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుంది. ఈ చిత్రంలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది.ఈ మూవీలో విజయ్ దేవర కొండ కొత్త లుక్ లో కనిపిస్తున్నారు. స్టయిలిష్ లుక్ లో కనిపిస్తున్న విజయ్ దేవరకొండ ను చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. జుట్టు పెంచడంతో పాటు మీసాలను పెంచి క్లీన్ షేవ్ తో కనిపించడంతో లుక్ అదిరిపోతుంది.
ప్రీ పొడక్షన్ పనులు...
ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన ప్రీ పొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఈ మూవీకి సంబంధించి భారీ సెట్ ను హైదరాబాద్ లో ఏర్పాటు చేస్తున్నారు. మూవీ దాదాపు ఎక్కువ భాగం ఈ సెట్ లోనే చిత్రీకరించేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. ఈ నెల రెండో వారం నుంచి ఈ చిత్రం షూటింగ్ ప్రారంభమవుతుందని సమాచారం. అయితే ఈ సినిమా పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతుందని, రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో 1854 -1878 మధ్య కాలంలో జరిగిన కథగా చెబుతున్నారు. మరి విజయ్ ఫ్యాన్స్ కు అదిరేటి కబురు త్వరలోనే అధికారికంగా మేకర్స్ చెబుతున్నారు.
Next Story