Wed Mar 18 2026 20:00:44 GMT+0530 (India Standard Time)
రోజా పై పరుచూరి భారీ డైలాగ్

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, సినీ నటి రోజాపై సినీ రచయిత పరుచూరి గోపాలకృష్ణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పరుచూరి పలుకులు పేరుతో సినీ జివితంలో తన అనుభవాలను సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు. 1980లలో తాను దర్శకత్వం వహించిన సర్పయాగం సినిమాలో శోభన్ బాబు కూతురిగా రోజాను తీసుకున్నామని, రామానాయుడిని వారించి మరీ ఆమెనె తీసుకున్నందుకు ఎంతో బాగా నటిచిందన్నారు. ఆమె నవ్వులో తెలుగుదనం కనిపించిందని, నటనపై ఆమెకు ఎంతో ప్రేమ ఉండేదన్నారు. రాజకీయాల్లోకి వెళ్లకుండా సినిమాల్లోనే ఉండుంటే రోజా.. శ్రీదేవి లాగా గొప్ప పేరు తెచ్చుకునేదన్నారు.
Next Story

