Sat Mar 21 2026 18:08:28 GMT+0530 (India Standard Time)
విషాదం...నలుగురి మృతి

మేడ్చల్ జిల్లా శామీర్ పేట మండలం తుర్కపల్లి గ్రామ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. అగి వున్న లారీ ని వెనుక కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందారు. మేడ్చల్ జిల్లా శామీర్ పేట మండలం తుర్కపల్లి గ్రామ సమీపంలో రాజీవ్ రహదారి పైఈ ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు జరుపుతున్నారు. మృతులు సత్తవ్వ, శ్రవణ్, షాలినిగా గుర్తించారు. వీరంతా జగిత్యాల జిల్లాకు చెందిన రాజారామ్ గ్రామానికి చెందినవారు. దుబాయ్ నుంచివస్తున్న కుటుంబసభ్యులను రిసీవ్ చేసుకోవడానికి ఎయిర్ పోర్టుకు వెళుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
Next Story

