Fri Mar 20 2026 14:49:39 GMT+0530 (India Standard Time)
నానా అలాంటి వారు కాదు

బాలీవుడ్ నటుడు నానా పటేకర్ తనపై లైంగిక వేదింపులకు పాల్పడ్డాడని చెప్పి #మీటూ ఉద్యమానికి నటి తనుశ్రీ దత్తా నాంధి పలికారు. 2008లో ఓ సినిమా సెట్ లో నానా పటేకర్ తనను వేదించారని ఆమె ఆరోపించారు. తనుశ్రీ కి బాలీవుడ్ నటీనటులు ప్రియాంక చోప్రా, సోనమ్ అహుజ, ట్వికిల్ ఖన్నా, ఫర్హాన్ అక్తర్ తదితరులు మద్దతు తెలిపారు. అయితే, వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మాత్రం వీరికి భిన్నంగా స్పందించారు. తన యూట్యూబ్ ఛానల్ లో వీడియో సందేశాన్ని ఆయన పెట్టారు. తనకు తెలిసి నానా పటేకర్ తప్పగా ప్రవర్తించేవాడు కాదని ఆయన ఆర్జీవీ అన్నారు. ఆయన కొంచెం ఘాటుగా మాట్లాడే వ్యక్తి అయినా ఎవరినీ బాధపెట్టేవారు కాదు అని అన్నారు. అయితే, నానా అసభ్యంగా తాకాడని తనుశ్రీ అనారని, అయితే, ఆయన కావాలని అలా చేసి ఉండరని వర్మ అన్నారు. తనుశ్రీ తన ఆరోపణలపై పునరాలోచించుకోవాలని హితవు పలికారు.
Next Story

