Tue Mar 17 2026 13:45:17 GMT+0530 (India Standard Time)
విడాకుల వెనుక వాస్తవాలు చెబితే....

పవన్ కళ్యాణ్ అభిమానులకు ఆయన మాజీ భార్య రేణూ దేశాయ్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. పవన్ తో విడాకుల తర్వాత చాలా రోజులు ఒంటరిగా ఉన్న ఆమె ఇటీవల రెండో పెళ్లి కోసం నిశ్చితార్ధం చేసుకున్నారు. దీంతో పవన్ కళ్యాణ్ అభిమానులు ఆమె నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇది భరించలేని ఆమె ట్విట్టర్ కి కూడా దూరమయ్యారు. అయితే, ఇన్ స్టాగ్రామ్ లోనూ ఆమెను పవన్ అభిమానులు వదలడం లేదు. ఆమెను ట్రోల్ చేస్తూ వ్యాఖ్యలు చేస్తున్నారు. దీంతో రేణూ ఘాటుగా స్పందించారు. పవన్ కళ్యాణ్ తో విడాకులకు కారణాలపై తాను నోరు విప్పితే ఆయన అభిమానుల పొగరు మురికికాలువలో పడుతుందని, ఇన్నిరోజులుగా విడాకులపై మౌనంగా ఉంటున్నందుకు ఆయన అభిమానులు కృతజ్ఞతతో ఉండాలన్నారు. తాను గనుక విడాకుల వెనుక వాస్తవాలపై నోరు తెరిచి మాట్లాడితే అవివేకులైన, మర్యాద తెలియని అభిమానులకు గర్వభంగం అవుతుందని హెచ్చరించారు.
Next Story

