Fri Dec 12 2025 22:05:38 GMT+0000 (Coordinated Universal Time)
విడాకులపై రేణు సంచలన వ్యాఖ్యలు

పవన్ కళ్యాణ్ మాజీ భర్య రేణు దేశాయ్ పవన్ తో విడాకుల అంశంపై మళ్లీ స్పందించారు. ఇటీవల ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ...పవన్ కళ్యాణే తనకు విడాకులు ఇవ్వాలని కోరారని పేర్కొన్నారు. అయితే, కొందరు పవన్ అభిమానులు మాత్రం ఆమెను సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. దీంతో మళ్లీ స్పందించిన ఆమె...‘ 2012 మార్చి 13న బేబీ పోలినా పుట్టింది. ఆ తర్వాత మూడు రోజులకు 2012 మార్చి 16న తనకు పవన్ విడాకులు ఇచ్చారు. అంటే 2011 జులైలోనే పవన్ మూడో భార్య అన్నా లెజినోవా గర్భందాల్చింది.’ అని రేణు పోస్ట్ చేశారు. తనతో విడాకులు తీసుకోకముందే పవన్ కి అన్నా లెజినోవాతో సంబంధం ఉన్నట్లుగా ఆమె పోస్ట్ చేశారు. తనకు మెసేజ్ లు వస్తున్నాయని, విడాకుల మీద కొంతమంది గందరగోళాన్ని సృష్టిస్తున్నారని, అందుకే ఈ వివరణ ఇస్తున్నానని ఆమె తెలిపారు.
Next Story

