Thu Dec 18 2025 07:30:58 GMT+0000 (Coordinated Universal Time)
"18 పేజెస్" రిలీజ్ డేట్ ఎప్పుడంటే...?

యువ హీరో నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ హీరో, హీరోయిన్లుగా నటించిన 18 పేజెస్ సినిమా విడుదల తేదీ ఖరారాయింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 18వ తేదీన థియేటర్స్ లో రిలీజ్ చేయనున్నట్ుల మేకర్స్ తెలిపారు. ఈ మేరకు18 పేజెస్ కు సంబంధించిన కొత్త పోస్టర్ ను ఈరోజు రిలీజ్ చేశారు.
ఫస్ట్ లుక్ తోనే....?
హీరో నిఖిల్ హీరోగా 18 పేజెస్ మూవీ ఫస్ట్ లుక్ గతంలోనే ఆకట్టుకుంది. ఈ చిత్రానికి పల్నాటి సూర్యప్రతాప్ డైరెక్షన్ చేయగా, బన్నీ వాసు నిర్మాణ సారధ్యాన్ని తీసుకున్నారు. కథ, స్క్రీన్ ప్లే సుకుమార్ అందిస్తున్నారు. అల్లు అరవింద్ 18 పేజెస్ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. కొత్తగా మేకర్స్ రిలీజ్ చేేసిన పోస్టర్ అందరినీ ఆకట్టుకుంటుంది.
Next Story

