Sat Jul 27 2024 01:43:52 GMT+0000 (Coordinated Universal Time)
Mangalavaaram : పాయల్ రాజ్‌పుత్ మూవీకి మెగా హీరోలు ఎందుకు సపోర్ట్ ఇస్తున్నారో తెలుసా..?
పాయల్ రాజ్‌పుత్ మూవీ ‘మంగళవారం’కి మెగా హీరోలు ఎందుకు సపోర్ట్ ఇస్తున్నారో తెలుసా..? ఒకప్పటి మిత్రుడు..
![Chiranjeevi, Allu Arjun, Payal Rajput, Mangalavaaram Chiranjeevi, Allu Arjun, Payal Rajput, Mangalavaaram](https://www.telugupost.com/h-upload/2023/11/10/1559281-chiranjeevi-allu-arjun-payal-rajput-mangalavaaram.webp)
Mangalavaaram : ఆర్ఎక్స్ 100 సినిమాతో డైరెక్టర్ అజయ్ భూపతి, హీరో కార్తికేయ, హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ ఇండస్ట్రీలో మంచి ఫేమ్ ని సంపాదించుకున్నారు. ఈ సినిమా తరువాత ముగ్గురు ఎవరి కెరీర్ లో వాళ్ళు ముందుకు వెళ్తూ వస్తున్నారు. అయితే అజయ్ భూపతి, పాయల్ రాజ్‌పుత్ కలిసి ‘మంగళవారం’ సినిమా కోసం మరోసారి పని చేశారు. సస్పెన్స్ థ్రిల్లర్ వస్తున్న ఈ మూవీ స్టోరీ మొత్తం పాయల్ చుట్టూనే తిరగనుంది.
లేడీ ఓరియంటెడ్ మూవీగా వస్తున్న నవంబర్ 17న తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి టీజర్ అండ్ ట్రైలర్ రిలీజ్ కాగా.. ఆడియన్స్ లో మూవీ పై క్యూరియాసిటీ క్రియేట్ చేశాయి. ఇది ఇలా ఉంటే, ఈ సినిమా కోసం మెగా హీరోలు ఒక్కొక్కరిగా కదిలి వస్తున్నారు. ట్రైలర్ రిలీజ్‌కి చిరంజీవి, ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి అల్లు అర్జున్ వస్తుండడం విశేషం.
ఈ సినిమాకి చిరంజీవి సపోర్ట్ ఇవ్వడానికి కారణం.. ఈ చిత్ర నిర్మాత స్వాతి రెడ్డి తన కుమార్తె శ్రీజకి మంచి ఫ్రెండ్ అని చిరునే చెప్పుకొచ్చారు. అయితే దీని వెనుక అసలు కారణం వేరే ఉంది. శ్రీజ, స్వాతి రెడ్డి స్నేహితులు అవ్వడానికంటే ముందు వారి ఫాదర్స్ చిరంజీవి, నిమ్మగడ్డ ప్రసాద్ మంచి మిత్రులు. మంగళవారం చిత్ర నిర్మాత స్వాతి రెడ్డి.. నిమ్మగడ్డ ప్రసాద్ కుమార్తె. పెళ్లి అయ్యి ఆమె అత్తారింటికి వెళ్లడంతో సినీ నిర్మాణంలో ఆమె పేరు నిమ్మగడ్డ స్వాతి రెడ్డికి బదులు స్వాతిరెడ్డి గునుపాటి అని కనిపించింది.
అందుకనే ఆమె ఎవరో త్వరగా కనిపెట్టలేకపోయారు. కాగా చిరు, నిమ్మగడ్డ కలిసి గతంలో పలు బిజినెస్‌ల్లో భాగస్వాములుగా కొనసాగిన విషయం అందరికి తెలిసిందే. ఇప్పటికి కూడా చిరుతో నిమ్మగడ్డ బంధం అలానే కొనసాగుతూ ఉంది. చిరంజీవితో పాటు ఇండస్ట్రీలోని ఇతర హీరోలతో కూడా నిమ్మగడ్డకి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఈ రిలేషన్ ఉండడం వలనే మెగా హీరోలు చిరు, అల్లు అర్జున్.. పాయల్ రాజ్‌పుత్ మూవీకి సపోర్ట్ గా నిలుస్తున్నారు.
Next Story