రవితేజ బోణి చేస్తాడా?
కరోనా లాక్ డౌన్ తో అనుకున్న ప్లాన్స్ అన్ని తారుమారయ్యాయి. రామ్ అయితే ఇస్మార్ట్ శంకర్ హిట్ తర్వాత రెడ్ సినిమాతో ప్రేక్షకులను ఊపుదాముకున్నాడు. ఇక నాని [more]
కరోనా లాక్ డౌన్ తో అనుకున్న ప్లాన్స్ అన్ని తారుమారయ్యాయి. రామ్ అయితే ఇస్మార్ట్ శంకర్ హిట్ తర్వాత రెడ్ సినిమాతో ప్రేక్షకులను ఊపుదాముకున్నాడు. ఇక నాని [more]
కరోనా లాక్ డౌన్ తో అనుకున్న ప్లాన్స్ అన్ని తారుమారయ్యాయి. రామ్ అయితే ఇస్మార్ట్ శంకర్ హిట్ తర్వాత రెడ్ సినిమాతో ప్రేక్షకులను ఊపుదాముకున్నాడు. ఇక నాని – సుధీర్ బాబు ‘వి’ తో వచ్చేద్దామనుకున్నారు. అనుష్క భాగమతి తర్వాత భారీ గ్యాప్ తో నిశ్శబ్దాన్ని చీల్చుదామనుకుంది. ఇక పవన్ వకీల్ సాబ్ తో గ్రాండ్ గా రీ ఎంట్రీ ప్లాన్ చేసాడు. కానీ కరోనా మహమ్మారి వలన ఏ ఒక్క సినిమా థియేటర్స్ లోకి దిగలేకపోయాయి. అలాగే ఎప్పుడు థియేటర్స్ తెరచుచుకుంటాయో కూడా చెప్పలేని స్థితి. ఈలోపు ఓటిటి వాళ్ళు ఊపందుకుని ఒక్కో సినిమాని లాగేస్తున్నారు. ఇప్పటివరకు చిన్న చితక సినిమాల్తో పని కనిచ్చినా ఓటిటి వారు ఇంతకుముందే మీడియం రేంజ్ సినిమాలపై కన్నేసింది. కనకనే భారీ ధర పెట్టి రామ్ రెడ్, వి, అనుష్క నిశ్శబ్ధాలను కొనేద్దామని తిరిగారు. కానీ హీరోలు ఒప్పుకోలేదు.
ఇప్పుడు ఓటిటి నుండి చిన్న చిన్న సినిమాలు విడుదలవుతున్నాయి. కానీ ఓటిటికి ఓ పెద్ద సినిమా కావాలి. ఓటిటి క్రేజ్ పెరగాలి, ఇంకా వ్యూవర్ షిప్ పెంచుకోవాలంటే నాని ని, రామ్ ని, అనుష్క ని ఎవరో ఒకరిని పడెయ్యాలి. కానీ సాద్య పడ్డం లేదు. అయితే తాజాగా రవితేజ క్రాక్ సినిమాతో ఓటిటి లో ఎంటర్ అవ్వబోతున్నాడని అంటున్నారు. క్రాక్ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. ఆ సినిమా షూట్ పూర్తి చేసి ఆ సినిమాని ఓటిటికి ఇచ్చేయాలని మూవీ టీం భావిస్తుందట. ఇప్పటికే నిర్మాత ఠాగూర్ మధు ఓటిటి వాళ్లతో బేరసారాలకు దిగినట్లుగా టాక్. మరి రవితేజ అయినా తన సినిమాతో ఓటిటి కి బోణి కొడితే.. మిగతావాళ్ళు క్యూ కడతారేమో చూడాలి. ఇప్పటికే బాలీవుడ్ తారలంతా ఓటిటికి జై కొడుతున్నారు. కానీ మన హీరోలే ఇంకా బెట్టు చేస్తున్నారు.