Thu Dec 18 2025 12:10:12 GMT+0000 (Coordinated Universal Time)
Rashmika Mandanna : సౌందర్య బయోపిక్ చేస్తానంటున్న రష్మిక..
నేషనల్ క్రష్ రష్మిక మందన్న.. అలనాటి నటి సౌందర్య బయోపిక్ లో నటిస్తునంటూ స్టేట్మెంట్ ఇచ్చారు.

Rashmika Mandanna : నేషనల్ క్రష్ రష్మిక మందన్న.. టాలీవుడ్ టు బాలీవుడ్ వరుస ఆఫర్లు అందుకుంటూ ముందుకు దూసుకుపోతున్నారు.. ఒక పక్క స్టార్ హీరోల సినిమాల్లో హీరోయిన్ గా నటిస్తూనే, మరో పక్క లేడీ ఓరియంటెడ్ సినిమాలకు కూడా సైన్ చేస్తున్నారు. ప్రస్తుతం రష్మిక చేతిలో అరడజను వరకు సినిమాలు ఉన్నాయి. ఇది ఇలా ఉంటే, ఈ భామ అలనాటి నటి సౌందర్య బయోపిక్ లో నటిస్తునంటూ స్టేట్మెంట్ ఇచ్చారు.
బయోపిక్స్ లో నటించే ఆలోచన ఏమైనా ఉందా అని రష్మికని రీసెంట్ ఇంటర్వ్యూలో ప్రశ్నించగా, ఆమె బదులిస్తూ.. "నేను సినీ పరిశ్రమకు రాకముందు, మా నాన్న నాతో ఒక మాట అనేవారు. నేను చూడడానికి కొంచెం సౌందర్య గారిలా ఉన్నానని చెప్పేవారు. ఒకవేళ నేను నిజంగా అలాగే ఉన్నానని అనిపిస్తే.. ఆమె బయోపిక్ లో నటించాలని అనుకుంటున్నా. ఆమె జర్నీ నా ఎంతో ఇష్టం" అని తెలిపారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
కొంతమంది ఆడియన్స్ కూడా రష్మిక సౌందర్య పాత్రకి సెట్ అవుతుందని కామెంట్స్ చేస్తూ వస్తున్నారు. మరి రష్మిక మాటల్ని ఎవరైనా దర్శకుడు గమనించి.. సౌందర్య బయోపిక్ ని తెరపైకి తీసుకు వస్తారా లేదా అనేది చూడాలి. మహానటి సావిత్రి బయోపిక్ చూసిన తెలుగు ఆడియన్స్.. ఎప్పటి నుంచో సౌందర్య బయోపిక్ కోసం ఎదురు చూస్తున్నారు. మరి ఈ ఎదురు చూపులకు ఎప్పుడు తెర పడుతుందో చూడాలి.
Next Story

