Sat Jan 31 2026 13:18:03 GMT+0000 (Coordinated Universal Time)
హాట్ హాట్ గా రష్మీ ’అంతకు మించి’

యాంకర్ నుంచి హీరోయిన్ గా మారిన రష్మీ గౌతమ్ ‘అంతకు మించి’ అంటూ వస్తోంది. గత సంవత్సరం చివరగా హారర్ డ్రామా అయిన నెక్ట్స్ నువ్వే సినిమాలో నటించిన రష్మీ మళ్లీ హారర్, రొమాంటిక్, కామెడీ కలగలిసిన సినిమాతోనే ప్రేక్షకులను ఆకట్టుకోవాలని చూస్తోంది. ఇటీవల విడుదలైన ‘అంతకు మించి’ ట్రైలర్ కి మంచి స్పందన వస్తోంది. రష్మీతో జై అనే కొత్త నటుడు జతకట్టాడు. వీరిద్దరూ దెయ్యాలతో బయపడే వారికి దెయ్యాలు లేవని నమ్మించేందుకు ప్రయత్నం చేయడమే ఈ చిత్ర ప్రధాన కథ అని ట్రైలర్ లో స్పష్టమవుతోంది. హారర్ సన్నివేశాలతో పాటు రష్మీ, జై రొమాంటిక్ సీన్లు బాగానే ఉండనున్నాయి. ఈ చిత్రానికి సునీల్ కశ్యప్ మ్యూజిక్ అందిస్తుండగా, ఎస్ జై ఫిల్మ్స్ బ్యానర్ పై సతీష్ గాజుల నిర్మిస్తున్నారు.
[embed]https://youtu.be/NbGRyx_UUk0[/embed]
Next Story

