ముంబై అడ్డాగా ప్లాన్ చేస్తా అంటున్న హీరోయిన్
టాలీవుడ్ లో రెండు సినిమాలు ప్రస్తుతం ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. మరో సినిమా కూడా త్వరలోనే విడుదలకాబోతుంది. అయినప్పటికీ ఆ హీరోయిన్ కి బాగా టెన్షన్. ఆమె [more]
టాలీవుడ్ లో రెండు సినిమాలు ప్రస్తుతం ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. మరో సినిమా కూడా త్వరలోనే విడుదలకాబోతుంది. అయినప్పటికీ ఆ హీరోయిన్ కి బాగా టెన్షన్. ఆమె [more]

టాలీవుడ్ లో రెండు సినిమాలు ప్రస్తుతం ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. మరో సినిమా కూడా త్వరలోనే విడుదలకాబోతుంది. అయినప్పటికీ ఆ హీరోయిన్ కి బాగా టెన్షన్. ఆమె ఎవరో కాదు రాశి ఖన్నా. వెంకిమామ తో రేపు, ప్రతి రోజు పండగే తో ఈ నెల 20 న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న రాశి ఖన్నా కి ఈ రెండు సినిమాల్లో ఓ సినిమా హిట్ అత్యవసరం. వరల్డ్ ఫెమస్ లవర్ లో సందట్లో సడేమియా లా ఓ హీరోయిన్. అందుకే రాశికి ఇప్పుడు టెన్షన్ పట్టుకుంది. మరోవైపు కోలీవుడ్లో ను ఓ అన్నంత ఆఫర్స్ రావడం లేదు.
తెలుగులో ఏదో ఒక సినిమాతో బిజీగా వుంటున్న రాశి కి తెలుగులో బావుంది కదా అని గచ్చిబౌలి లో ఓ ఖరీదైన ప్లాట్ కొనుక్కుని సెటిలవుదామనుకుంది. కానీ రాశికి తెలుగులో షాకుల మీద షాకులు తగులుతూనే ఉన్నాయి. మరో పక్క కోలీవుడ్ లోను ఆశించిన విజయాలు దక్కడం లేదు. అందుకే రాశి ఖన్నా ఇప్పుడు ముంబై అడ్డాగా అవకాశాల కోసం ప్లాన్ చేస్తుందట. ముంబై కి మకాం మార్చేసి బాలీవుడ్ లోను అదృష్టాన్ని పరీక్షించుకోవాలని డిసైడ్ అవడంతో హైదరాబాద్ గచ్చిబౌలి లోని ప్లాట్ ని అద్దెకి ఇచ్చేసింది అనే టాక్ నడుస్తుంది. మరి ముంబై లో బాలీవుడ్ అవకాశాల కోసం ట్రై చేస్తూ… సౌత్ ని కూడా చూసుకుందామని డిసైడ్ అయ్యిందట రాశి. మరి రాశి కి తెలుగులోనూ, తమిళ్ లోను లేని అవకాలు బాలీవుడ్ నుండి మాత్రం వస్తాయా అంటూ నోరు నొక్కుకుంటున్నారు జనాలు.

