Fri Mar 21 2025 07:52:53 GMT+0000 (Coordinated Universal Time)
సమ్మర్ లో "రంగరంగ వైభవంగా" విడుదల
మూడో సినిమాతో ఫ్యామిలీ ఆడియన్స్ దగ్గరవ్వాలనుకున్నాడు వైష్ణవ్. అందుకే "రంగరంగ వైభవంగా" సినిమాతో ప్రేక్షకుల ముందుకు..

మెగా కాంపౌండ్ నుంచి టాలీవుడ్ కి ఉప్పెన సినిమాతో హీరో గా పరిచయమయ్యాడు వైష్ణవ్ తేజ్. మొదటి సినిమాతోనే భారీ హిట్ కొట్టిన ఈ మెగా హీరో.. తొలి పరిచయంతోనే యూత్ తో పాటు.. మాస్ ఆడియన్స్ నుంచి మంచి మార్కులు కొట్టేశాడు. ఇక వైష్ణవ్ నటించిన రెండో సినిమా కొండపొలం. చదువుకున్న కుర్రాడు.. ఒక పులిని ఎలా ఎదురించాడన్న సందేశంతో ఈ సినిమా నిర్మించారు కానీ.. ఆడియన్స్ ను పెద్దగా మెప్పించలేకపోయారు.
మూడో సినిమాతో ఫ్యామిలీ ఆడియన్స్ దగ్గరవ్వాలనుకున్నాడు వైష్ణవ్. అందుకే "రంగరంగ వైభవంగా" సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అయిపోతున్నాడు. ప్రేమతో కూడుకున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోంది ఈ సినిమా. మన అర్జున్ రెడ్డిని తమిళంలో రీమేక్ చేసిన గిరీశాయ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా "రంగరంగ వైభవంగా" రిలీజ్ డేట్ ను ప్రకటించారు మేకర్స్. సమ్మర్ లో ఫ్యామిలీ ప్రేక్షకులకు వినోదాన్ని పంచేలా మే 27వ తేదీన ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమాలో వైష్ణవ్ కు జోడీగా.. కేతిక శర్మ నటిస్తోంది. విశేషం ఏంటంటే.. వైష్ణవ్, కేతికలకు కెరియర్ పరంగా ఇది మూడో సినిమా.
News Summary - Ranga Ranga Vaibhavamga Movie Release Date Confirmed
Next Story