Sun Feb 01 2026 08:47:15 GMT+0000 (Coordinated Universal Time)
ఘనంగా అలియా-రణబీర్ వివాహం
వీరి వివాహం గురువారం ముంబైలో ఘనంగా జరిగింది. తమ పరిణయ మహోత్సవానికి సంబంధించిన

ముంబై : బాలీవుడ్ లవ్ బర్డ్స్ రణబీర్ కపూర్ - అలియా భట్ మొత్తానికి వివాహంతో ఒక్కటయ్యారు. వీరి వివాహం గురువారం ముంబైలో ఘనంగా జరిగింది. తమ పరిణయ మహోత్సవానికి సంబంధించిన తొలి ఫొటోను అలియా సోషల్ మీడియాలో షేర్ చేశారు. "మాకెంతో ఇష్టమైన ప్రదేశంలోనే మేం ఒక్కటయ్యాం. గత ఐదేళ్లుగా మేం ఊసులు చెప్పుకున్న బాల్కనీ సాక్షిగా పెళ్లి చేసుకున్నాం" అంటూ అలియా ఇన్ స్టాగ్రామ్ లో పేర్కొన్నారు.
ముంబైలోని రణబీర్ కపూర్ నివాసమైన వాస్తు లో.. అతని కొద్దిమంది సన్నిహుతులు, కుటుంబ సభ్యుల మధ్య అలియా-రణబీర్ ల వివాహం జరిగింది. నీతూ కపూర్, కరీనా కపూర్, సైఫ్ అలీ ఖాన్, కరిష్మా కపూర్, కరణ్ జోహార్, అయాన్ ముఖర్జీ తదితరులు పెళ్లింట సందడి చేశారు. పెళ్లి వేడుకకు హాజరైన వారి మొబైల్ కెమెరాలను అనుమతించలేదు.
Next Story

