Sat Dec 07 2024 14:06:31 GMT+0000 (Coordinated Universal Time)
Rana Shahrukh Khan: షారుఖ్ ఖాన్ పాదాలను తాకిన రానా దగ్గుబాటి
రానా దగ్గుబాటి IIFA (ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ అవార్డ్స్) అవార్డ్స్ 2024 ప్రెస్ కాన్ఫరెన్స్లో షారూఖ్ ఖాన్ పాదాలను తాకి ఆశీర్వాదం తీసుకున్న...
రానా దగ్గుబాటి IIFA (ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ అవార్డ్స్) అవార్డ్స్ 2024 ప్రెస్ కాన్ఫరెన్స్లో షారూఖ్ ఖాన్ పాదాలను తాకి ఆశీర్వాదం తీసుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. సెప్టెంబర్ 10న ముంబైలో జరిగిన ఈ కార్యక్రమంలో షారుఖ్ ఖాన్, కరణ్ జోహార్, రానా దగ్గుబాటి, సిద్ధాంత్ చతుర్వేది, అభిషేక్ బెనర్జీ తదితరులు పాల్గొన్నారు. బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో లెజెండ్ అయిన షారుఖ్ ఖాన్ పాదాలను రానా తాకడంపై ప్రశంసలు కురుస్తున్నాయి. దక్షిణాది వ్యక్తులు తమకంటే పెద్ద వాళ్ళను ఇలా గౌరవిస్తారని తెలిపారు. రానా అలా చేయగానే షారుఖ్ ఖాన్ చిరునవ్వుతో కౌగలించుకుని, రానాకు ముద్దు పెట్టాడు.
షారుఖ్ ఖాన్ వ్యక్తిత్వంపై రానా ప్రశంసలు కురిపించాడు. గతంలో దుబాయ్లో షారుఖ్ ఖాన్ గొప్ప హోస్ట్ లాగా మారి నాలుగు దక్షిణ భారత పరిశ్రమలకు చెందిన ప్రముఖులను అలరించిన సమయాన్ని రానా గుర్తుచేసుకున్నాడు. "సార్, మీకు గుర్తుందో లేదో నాకు తెలియదు, మేము నాలుగు భాషలకు చెందిన వాళ్లం. దుబాయ్లో ఒక ఈవెంట్ చేసాము. మేము మీ ఇంట్లో ఒక ఆఫ్టర్ పార్టీకి వచ్చాము." అని అన్నాడు. షారుఖ్ ఖాన్ "నేను దాని గురించి వీళ్ళందరికీ చెప్పాలా? నేను దానిని సీక్రెట్ గా ఉంచడానికి ప్రయత్నిస్తున్నాను." అని చెప్పి నవ్వులు పూయించారు. షారుఖ్ ఖాన్ నాలుగు పరిశ్రమలకు చెందిన నటీనటులను ఎంతగానో అలరించారని, ఆయన ఇచ్చిన ఆతిథ్యాన్ని అసలు మరిచిపోలేమని, ఎంతో గొప్ప వ్యక్తి షారుఖ్ ఖాన్ అంటూ రానా దగ్గుబాటి ప్రశంసలు కురిపించాడు.
IIFA అవార్డ్స్ 2024, సెప్టెంబర్ 27- 29 మధ్య అబుదాబిలోని యస్ ఐలాండ్లో జరుగుతుంది. షాహిద్ కపూర్, విక్కీ కౌశల్, జాన్వీ కపూర్, కృతి సనన్ ప్రత్యేక ప్రదర్శన చేస్తారని SRK ధృవీకరించారు.
Next Story