Sun May 12 2024 01:55:29 GMT+0000 (Coordinated Universal Time)
వర్మ మరో బయోపిక్… 'టైగర్ కేసీఆర్'
వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ బయోపిక్ ల వెంట పడుతున్నారు. ఇటీవలే లక్ష్మీస్ ఎన్టీఆర్ పేరుతో ఎన్టీఆర్ బయోపిక్ తీసిన ఆయన తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి [more]
వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ బయోపిక్ ల వెంట పడుతున్నారు. ఇటీవలే లక్ష్మీస్ ఎన్టీఆర్ పేరుతో ఎన్టీఆర్ బయోపిక్ తీసిన ఆయన తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి [more]
వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ బయోపిక్ ల వెంట పడుతున్నారు. ఇటీవలే లక్ష్మీస్ ఎన్టీఆర్ పేరుతో ఎన్టీఆర్ బయోపిక్ తీసిన ఆయన తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత స్నేహితురాలు శశికళ బయోపిక్ తీస్తున్నట్లు ప్రకటించారు. ఇక, ఇవాళ ఆయన మరో సంచలన బయోపిక్ తీస్తున్నట్లు ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బయోపిక్ ను 'టైగర్ కేసీఆర్' పేరుతో తీస్తున్నట్లు చెప్పారు. ''ధి అగ్రెసీవ్ గాంధీ'', ''ఆడు తెలంగాణ తెస్తనంటే అందరూ నవ్విండ్రు'' అనే రెండు ట్యాగ్ లైన్లు కూడా పెట్టి సినిమా పోస్టర్ కూడా వదిలారు. తెలంగాణ రాష్ట్రంలో కోసం ఆయన ఎలా పోరాడి సాధించారో చూపిస్తానని ఆయన ప్రకటించారు.
Next Story