Sun Dec 08 2024 09:01:40 GMT+0000 (Coordinated Universal Time)
"వ్యూహం"లో వైఎస్ భారతి పాత్రధారి పరిచయం : ఆర్జీవీ
తాజాగా ఈ చిత్రంపై మరో అప్డేట్ ఇచ్చారు. ఈ చిత్రంలోని పాత్రలు, వాటిలో నటించే నటీనటులను పరిచయం చేస్తూ..
ప్రముఖ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గతేడాది "వ్యూహం" అనే పొలిటికల్ చిత్రాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ చిత్రంపై మరో అప్డేట్ ఇచ్చారు. ఈ చిత్రంలోని పాత్రలు, వాటిలో నటించే నటీనటులను పరిచయం చేస్తూ ఆర్జీవీ ట్వీట్ చేశారు. ఈ సినిమాలో వైఎస్ జగన్ పాత్రను దక్షిణాది నటుడు అజ్మల్ అమీర్ పోషిస్తుండగా.. వైఎస్ భారతి పాత్రలో మానస రాధాకృష్ణన్ అనే యువతి నటిస్తోంది. వ్యూహం సినిమాకు సంబంధించి పలు స్టిల్స్ ను వర్మ సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు.
అయితే.. "వ్యూహం" బయోపిక్ కాదని, బయోపిక్ ను మించిన రియల్ పిక్ అని గతంలోనే ఆర్జీవీ ప్రకటించారు. ఈ సినిమాలో చూపించేవన్నీ నిజాలే ఉంటాయని కూడా స్పష్టతనిచ్చారు. ఈ రియల్ పిక్చర్ రెండు భాగాలుగా వస్తుందని తెలిపారు. మొదటిది వ్యూహం, రెండవది శపథం అని ఆర్జీవీ వివరించారు. గతేడాది రామ్ గోపాల్ వర్మ సీఎం జగన్ ను కలిసిన వెంటనే ఈ సినిమా ప్రకటన చేయడంతో అందరిలోనూ సినిమాపై ఆసక్తి కలిగింది. వర్మ తాజా స్టిల్స్ తో మళ్లీ ఇన్నాళ్లకు ఈ సినిమా ప్రస్తావన తెచ్చారు.
Next Story