Sun Feb 01 2026 04:39:50 GMT+0000 (Coordinated Universal Time)
మెగా వారసుడు వచ్చేశాడు
మెగా స్టార్ చిరంజీవి ఇంట గుడ్ న్యూస్ అందింది. రామ్ చరణ్ - ఉపాసన దంపతులకు కవల పిల్లలు జన్మించారు

మెగా స్టార్ చిరంజీవి ఇంట గుడ్ న్యూస్ అందింది. రామ్ చరణ్ - ఉపాసన దంపతులకు కవల పిల్లలు జన్మించారు. జనవరి 31వ తేదీ రాత్రి హైదరాబాద్ లోని అపోలో ఆసుపత్రిలో ఒక బాబు, ఒక పాపకు ఉపాసన జన్మనిచ్చింది. దీంతో మెగా స్టార్ కుటుంబంలో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. ఈ వార్తను చిరంజీవి స్వయంగా సోషల్ మీడియా వేదికగా తెలిపారు. తల్లి, ఇద్దరు పిల్లలు క్షేమంగా ఉన్నారని, తమ కటుంబంలోకి ఇద్దరు చిన్నారులు రావడం తమకు ఎంతో ఆనందం కలిగించిందని చిరంజీవి భావోద్వేగానికి గురయ్యారు.
కవలపిల్లలు జన్మించారని...
రామచరణ్ - ఉపాసన దంపతులకు కవలలు జన్మించారని, వారిలో మగశిశువు, మరొకరు ఆడశిశువు అని తెలపారు. తాతగా, నానమ్మగా తాము ఈ చిన్నారులను తమ కుటుంబంలోకి ఆహ్వానిస్తున్నామని చెప్పారు. ఇప్పటికే రామ్ చరణ్ - ఉపాసనలకు కుమార్తె క్లింకార ఉండటంతో, తమకు వారసుడు కావాలంటూ చిరంజీవి ఇటీవల ఒక సినీ ఫంక్షన్ లో చేసిన వ్యాఖ్యలను నిజం చేస్తూ మెగాస్టార్ కుటుంబంలో వారసుడు వచ్చేశాడు. దీంతో మెగా ఫ్యాన్స్ ఫుల్లు సంతోషంగా సంబరాలు చేసుకుంటున్నారు.
Next Story

