Thu Mar 23 2023 11:30:15 GMT+0000 (Coordinated Universal Time)
చరణ్ కు హైదరాబాద్ లో ఘన స్వాగతం
అమెరికాలో ప్రముఖ టాక్ షో లలో చరణ్ ఇంటర్వ్యూలతో ఆయన అంతర్జాతీయంగా బాబా పాపులర్ అయ్యారు. ఇక నాటు నాటు..

ప్రస్తుతం భారత్ లో ఓ హీరో పేరు మారుమోగిపోతోంది. ఆయనే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్. ఆర్ఆర్ఆర్ ఆస్కార్ అందుకోక ముందునుంచీ.. గతంలో ఏ తెలుగు హీరోకి లేనంత క్రేజ్ చరణ్ సొంతమైంది. అమెరికాలో ప్రముఖ టాక్ షో లలో చరణ్ ఇంటర్వ్యూలతో ఆయన అంతర్జాతీయంగా బాబా పాపులర్ అయ్యారు. ఇక నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు రావడంతో.. ఆర్ఆర్ఆర్ టీమ్ మొత్తానికీ అభిమానులు పెరిగిపోయారు. ఆస్కార్ అవార్డుల కార్యక్రమం కోసం అమెరికాకు వెళ్లిన చరణ్ నిన్న అర్ధరాత్రి దాటిన తర్వాత ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు చేరుకున్నారు.
భార్య ఉపాసనతో కలిసి శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న చరణ్ కు అభిమానులు ఘనంగా స్వాగతం పలికారు. జై చరణ్... జై ఎన్టీఆర్ అంటూ అభిమానులు నినాదాలు చేశారు. ఆ దంపతులపై పూలు చల్లుతూ అభిమానాన్ని చాటారు. ఈ సందర్భంగా అభిమానులకు అభివాదం చేసిన చరణ్.. తనపై ఇంత ప్రేమ చూపిస్తున్న అభిమానులందరికీ ధన్యవాదాలు తెలిపారు. అనంతరం చరణ్ కారు వెనుకే.. అభిమానులు తమ వాహనాల్లో ర్యాలీగా వెళ్లారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Next Story