Thu Dec 18 2025 07:35:28 GMT+0000 (Coordinated Universal Time)
Ram Charan : చరణ్‌తో సచిన్, అక్షయ్, సూర్య 'నాటు నాటు'..
మొన్న ఖాన్‌త్రయంతో 'నాటు నాటు' వేసిన రామ్ చరణ్.. తాజాగా సచిన్, అక్షయ్, సూర్యతో స్టెప్ వేశారు.

Ram Charan : మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ఎక్కడ కనిపించినా సరే.. ప్రతి ఒక్కరు ఆయనతో 'నాటు నాటు' స్టెప్ వేయించేస్తున్నారు. ఇటీవల అంబానీ వేడుకలకు వెళ్లిన చరణ్‌ని వేదిక మీదకు పిలిచి.. బాలీవుడ్ బడా హీరోలు ఆమిర్ ఖాన్, షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ నాటు నాటు పాటని చరణ్ తో కలిసి వేశారు. ఆ వీడియో ట్రేండింగ్ లిస్టు నుంచి ఇంకా వెళ్లనేలేదు, ఇప్పుడు తాజాగా మరో వీడియో వచ్చేసింది.
ఇక ఈ వీడియోలో క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్, బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్, తమిళ్ హీరో సూర్య.. రామ్ చరణ్ తో కలిసి నాటు నాటు స్టెప్ వేసి అదరగొట్టారు. గల్లీ క్రికెట్ ప్లేయర్స్ ని ప్రోత్సహించేందుకు 'ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్' (ISPL) అంటూ కొత్త లీగ్ ని స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఇక ఈ లీగ్ లో మొత్తం ఆరు జట్టులు ఉండగా, వాటికి ప్రెజెంటర్స్ గా పలువురు హీరోలు వ్యవహరిస్తున్నారు.
హైదరాబాద్ జట్టుకి రామ్ చరణ్, చెన్నైకి సూర్య, బెంగళూరుకి హృతిక్ రోషన్, కోల్‌కతాకి సైఫ్ అలీఖాన్, శ్రీనగర్‌కి అక్షయ్ కుమార్, ముంబయికి అమితాబ్ బచ్చన్ ప్రెజెంటర్స్ గా వ్యవహరిస్తున్నారు. కాగా నేడు ఈ ప్రీమియర్ లీగ్ మ్యాచ్స్ ఓపెనింగ్ ఈవెంట్ జరిగింది. ఇక ఈ ఈవెంట్ లోని చరణ్‌తో సచిన్, అక్షయ్, సూర్య 'నాటు నాటు' వేసి ఆకట్టుకున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
Next Story

