Fri Dec 05 2025 18:52:02 GMT+0000 (Coordinated Universal Time)
'నా కొత్త ఫ్రెండ్' అంటున్న రామ్చరణ్.. ఎవరో తెలుసా..?
నా కొత్త స్నేహితుడు అంటూ రామ్ చరణ్ అభిమానులకు తన న్యూ ఫ్రెండ్ ని పరిచయం చేశాడు. ఎవరో తెలుసా..?

టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ కి ఇండస్ట్రీలో చాలామంది స్నేహితులు ఉన్నారు. ప్రతి ఒక్కరితో స్నేహంగా ఉంటూ పరిశ్రమలో ఒక ఫ్రెండ్లీ నేచర్ ని తీసుకు వస్తున్నాడు. అయితే ఇప్పుడు రామ్ చరణ్ ఫ్రెండ్ లిస్టులోకి మరో కొత్త ఫ్రెండ్ వచ్చాడంట. ఈ విషయాన్ని రామ్ చరణ్ స్వయంగా తన సోషల్ మీడియా ద్వారా తెలియజేశాడు. ఇంతకీ ఆ ఫ్రెండ్ ఎవరు..?
రామ్ చరణ్ మంచి 'హార్స్ రైడర్' అని అందరికి తెలిసిన విషయమే. చాలా చిన్న వయసు నుండే గుర్రాల పై సవారీ చేస్తూ వాటితో స్నేహం చేస్తూ వచ్చాడు. టైం దొరికినప్పుడు ఆ గుర్రాలతోనే సమయం గడుపుతుంటాడు. ఇక గుర్రాలు పై ఉన్న ఇష్టంతో.. కొత్త గుర్రాలను కూడా కొనుగోలు చేసి తన ఫార్మ్ లోకి తెచ్చుకుంటాడు. ఈక్రమంలోనే చరణ్ దగ్గర ఇప్పటికే కొన్ని గుర్రాలు ఉన్నాయి. తాజాగా మరో గుర్రాన్ని రామ్ చరణ్ తెచ్చుకున్నాడు.
'మై న్యూ ఫ్రెండ్ బ్లేజ్' అంటూ ఆ గుర్రంతో ఉన్న పిక్ ని షేర్ చేసి తన అభిమానులకు పరిచయం చేశాడు. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. కాగా రామ్ చరణ్ ప్రస్తుతం నటిస్తున్న 'గేమ్ ఛేంజర్' (Game Changer) సినిమాలో కూడా హార్స్ రైడింగ్ సీన్ ఉంది. ఈ సినిమాలోని ఒక సాంగ్ చిత్రీకరణ సీన్.. ఈమధ్య లీక్ అయ్యి నెట్టింట వైరల్ అయ్యింది. ఆ లీక్ అయిన వీడియోలో రామ్ చరణ్ బ్లాక్ గుర్రం మీదనే సవారీ చేస్తున్నాడు.
దీంతో ఇప్పుడు ఈ 'బ్లేజ్' ఆ గుర్రమే అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. గతంలో మగధీర సినిమాలో కనిపించిన గుర్రాన్ని కూడా రామ్ చరణ్ కొనుగోలు చేసి తన దగ్గరకి తెచ్చుకున్నాడు. ఇప్పుడు అదే తరహాలో గేమ్ ఛేంజర్ లోని గుర్రాన్ని కూడా ఇష్టపడి కొనుగోలు చేసి ఉంటాడని కామెంట్స్ వస్తున్నాయి.
Next Story

