Fri Dec 05 2025 12:26:22 GMT+0000 (Coordinated Universal Time)
Ramcharan : వావ్ .. రామ్ చరణ్ తో ఆ దర్శకుడు మూవీ తీస్తే ఇక ఆపేదెవరు?
రామచరణ్ విభిన్నకథలను ఎంచుకుంటారు. RRR తర్వాత రామ్ చరణ్ పాన్ ఇండియా రేంజ్ కు ఎదిగారు

రామచరణ్ విభిన్నకథలను ఎంచుకుంటారు. RRR తర్వాత రామ్ చరణ్ పాన్ ఇండియా రేంజ్ కు ఎదిగారు. మెగా ఫ్యాన్స్ కు మాత్రమే కాకుండా టు సామాన్య ప్రేక్షకులకు కూడా దగ్గరయిన రామ్ చరణ్ మూవీకి బజ్ మామూలుగా ఉండదు. యంగ్ హీరోలలో రామ్ చరణ్ తో ఒక మూవీ తీయాలన్న కోరిక ప్రతి దర్శకుడిలోనూ ఉంటుంది. నిర్మాతలకయితే కొదవుండదు. ఎందుకంటే మినిమం ప్రాఫిట్ గ్యారంటీ అనేది రామ్ చరణ్ మూవీకి ఉంటుందన్న భావన అందరిలోనూ ఉంటుంది. రామ్ చరణ్ తో నటించాలని ప్రతి ఒక్క నటుడు, హీరోయిన్ కూడా కోరుకుంటారు.
పెద్ది మూవీ తర్వాత...
రామ్ చరణ్ ప్రస్తుతం పెద్ది మూవీలో నటిస్తున్నాడు. బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీ శరవేగంగా షూటింగ్ పూర్తి చేసుకుంటుంది. రెండో షెడ్యూల్ ను కూడా స్టార్ట్ చేసింది. రాత్రి వేళ షూటింగ్ చేస్తున్నారని కూడా మేకర్స్ ఇటీవల అప్ డేట్ ఇచ్చారు. అయితే రామచరణ్ బ్యాక్ టు బ్యాక్ మూవీల గురించి తెలుసుకోవాలన్న ఆసక్తి అందరికీ ఉంటుంది. అయితే పెద్ది మూవీ బుచ్చిబాబుతో కంప్లీట్ అయిన తర్వాత రంగస్థలం, పుష్ప డైరెక్టర్ సుకుమార్ తో మూవీ చేయాలని నిర్ణయించుకున్నట్లు వార్తలు వచ్చాయి.
మాటల మాంత్రికుడితో...
కానీ తాజాగా అందుతున్న కబురు ఏంటంటే...రామ్ చరణ్ పెద్ది మూవీ షూటింగ్ పూర్తయిన తర్వాత మాటల మాంత్రికుడు, సక్సెస్ ఫుల్ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో మూవీలో నటిస్తారన్న న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ తొలుత అల్లు అర్జున్ తో మూవీ చేయాలనుకున్నప్పటికీ బన్నీ అట్లీతో ఫిక్స్ కావడంతో రామ్ చరణ్ కోసం మంచి కథను తివిక్రమ్ రెడీ చేసినట్లు తెలిసింది. వచ్చే ఏడాదిలోనే దీనికి సంబంధించిన షూటింగ్ కూడా ప్రారంభమవుతుందని చెబుతున్నారు. ఈ ప్రాజెక్టును హారిక అండ్ హాసిని క్రియేషన్స్ నిర్మిస్తున్నట్లు సమాచారం.కథను విన్న రామ్ చరణ్ ఓకే చెప్పారని కామెడీ, యాక్షన్, థ్రిల్లర్ మూవీగా రామ్ చరణ్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో మూవీ వస్తుందంటున్నారు. సో.. మెగా అభిమానులకు పండగే.
Next Story

