Sat Dec 07 2024 18:22:35 GMT+0000 (Coordinated Universal Time)
Rakul Preet Singh ఏడ్చేసిన రకుల్ ప్రీత్ సింగ్.. కారణం ప్రభాస్ సినిమా!
ప్రభాస్ తో నటించే అవకాశాన్ని తాను కోల్పోయానని ఆ సమయంలో
ప్రభాస్ సినిమాలో హీరోయిన్ గా అవకాశం అంటే చాలు ఇప్పటి హీరోయిన్లు ఎగిరి గంతేస్తారు. అయితే ప్రభాస్ సినిమాలోకి తీసుకుని, ఆ తర్వాత తీసేశారని తెలిస్తే ఎలా ఉంటుంది చెప్పండి. అచ్చం అలాంటి అనుభవమే హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కు ఎదురైంది. టాలీవుడ్ లో వరుసగా సినిమాలు చేసి టాప్ హీరోయిన్ స్థాయికి ఎదిగింది రకుల్. అయితే మన్మథుడు 2 తర్వాత అమ్మడి కెరీర్ తెలుగులో బాగా స్లో అయింది. ఇప్పుడు బాలీవుడ్ లో మంచి అవకాశాలు దక్కించుకుంది.
అయితే ప్రభాస్ తో నటించే అవకాశాన్ని తాను కోల్పోయానని, ఆ సమయంలో ఎంతో బాధపడ్డానని తెలిపింది రకుల్. ఏడ్చేశానని కూడా చెప్పుకొచ్చింది. ప్రభాస్ తో రెండు తెలుగు చిత్రాలలో ఒకప్పుడు తనను అనుకున్నారని, కానీ తన స్థానంలో వేరే హీరోయిన్ ను తీసుకున్నట్లు నటి రకుల్ ప్రీత్ సింగ్ తెలిపింది. రకుల్ యూట్యూబర్ రణ్వీర్ అలహబాడియాతో ఈ విషయాలను పంచుకుంది. నేను అరంగేట్రం చేయడానికి ముందు నాలుగు రోజుల పాటూ షూటింగ్ చేసిన తర్వాత ఒక చిత్రం నుండి నన్ను తప్పించారు.. ఇది ప్రభాస్ తో తెలుగు సినిమా అని తెలిపింది. కొన్నిసార్లు, పరిశ్రమ గురించి మీకు పెద్దగా తెలియనప్పుడు ఎంతో బాధను కలిగిస్తుందని రకుల్ తెలిపింది. నేను నా షెడ్యూల్ ముగించుకుని ఢిల్లీ వెళ్ళాను. ఆ తర్వాత తన స్థానంలో వేరే హీరోయిన్ ను తీసుకున్నారని తరువాత తెలుసుకున్నానని తెలిపింది. ఎంతగానో ఏడ్చానని రకుల్ తన బాధను పంచుకుంది. అలాంటిదే మళ్లీ వేరే ప్రాజెక్ట్ విషయంలో జరిగింది. ఆ సినిమాకు నేను సంతకం చేసాను. అయితే షూటింగ్ ప్రారంభించలేదని తెలిపింది రకుల్. రెండు పెద్ద చిత్రాల విషయంలో నాకు అలాంటిది జరిగిందని చెప్పుకొచ్చింది.
రకుల్ ప్రీత్ సింగ్ 2009లో కన్నడ చిత్రం గిల్లితో తొలిసారిగా నటించింది. 2014లో యారియాన్తో బాలీవుడ్లోకి అడుగుపెట్టింది. 2011 లో కెరటం సినిమాతో రకుల్ ప్రీత్ సింగ్ టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చినా, వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమా ద్వారా సక్సెస్ ను, ఫేమ్ ను అందుకుంది. మహేష్ బాబు, రామ్ చరణ్, అల్లు అర్జున్, ఎన్టీఆర్, రవితేజ లాంటి స్టార్స్ తో రకుల్ ప్రీత్ సింగ్ నటించింది.

Next Story