దాని కోసమే నటించా అంటున్న హీరోయిన్?
టాలీవుడ్ లో చాలా తక్కువ సమయంలో స్టార్ హీరోలతో సినిమా చేసి.. స్టార్ హీరోయిన్ రేంజ్ అందుకున్న రకుల్ ప్రీత్ కి అంతే తొందరగా స్టార్ డం [more]
టాలీవుడ్ లో చాలా తక్కువ సమయంలో స్టార్ హీరోలతో సినిమా చేసి.. స్టార్ హీరోయిన్ రేంజ్ అందుకున్న రకుల్ ప్రీత్ కి అంతే తొందరగా స్టార్ డం [more]
టాలీవుడ్ లో చాలా తక్కువ సమయంలో స్టార్ హీరోలతో సినిమా చేసి.. స్టార్ హీరోయిన్ రేంజ్ అందుకున్న రకుల్ ప్రీత్ కి అంతే తొందరగా స్టార్ డం నుండి కిందకి వచ్చేసింది. ప్రస్తుతం తెలుగు లో అవకాశాలు లేకపోయినా.. తమిళనాట, హిందీ లో సినిమాలు చేసుకుంటున్న రకుల్ ప్రీత్ సింగ్ కేవలం ఓ కారు కొనుక్కోవడానికి హీరోయిన్ గా మారిందట. తాను సినిమాల్లోకి వచ్చేసిన ఉద్దేశ్యాన్ని చెబుతూ.. తాను కాలేజ్ చదివే రోజుల్లో ఓ కారు కొనుక్కోవాలని కోరిక ఉండేదట. తన ఫ్రెండ్స్ అందరిలో తనకే ముందు కారు కొనుక్కోవాలని, అది కూడా నా సొంత డబ్బు తో కారు కొనుక్కోవాలని అనుకునేదట.
అప్పుడే ఓ కన్నడ సినిమా ఆఫర్ రావడంతో సినిమాలలోకి వచ్చిందట. అయితే కారు కోసం సినిమా చేసిన తనకి చివరికి ఆ సినిమాలే వృత్తిగా మారాయని చెబుతుంది. ఇక జాబ్ విషయంలో ఎంత పర్ఫెక్ట్ గ ఉంటామో.. సినిమాల విషయంలోనూ అంతే నిబద్ధతతో పనిచేస్తూ కష్టపడుతున్నా అంటుంది . స్టార్ డం, క్రేజ్ అనే పదాలకు దూరంగా ఉంటాను గనకే నా వృత్తిని ప్రేమించగలుగుతున్నా అంటుంది రకుల్ ప్రీత్.