Thu Dec 18 2025 17:58:16 GMT+0000 (Coordinated Universal Time)
జయా బచ్చన్ కు కోవిడ్ పాజిటివ్.. ఆగిపోయిన షూటింగ్ !
జయకు కరోనా పాజిటివ్ వచ్చినట్లుగా బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) అధికారి ఒకరు ప్రకటించారు. ప్రస్తుతం

ప్రముఖ సీనియర్ బాలీవుడ్ నటి, రాజ్యసభ సభ్యురాలు, అమితాబ్ బచ్చన్ సతీమణి జయా బచ్చన్ కు కరోనా సోకింది. జయకు కరోనా పాజిటివ్ వచ్చినట్లుగా బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) అధికారి ఒకరు ప్రకటించారు. ప్రస్తుతం జయ బచ్చన్ ఇంట్లోనే ఐసోలేషన్ లో ఉంటూ చికిత్స తీసుకుంటున్నారు. జయకు కరోనా పాజిటివ్ గా తేలడంతో.. ఆమె నటిస్తోన్న "రాకీ ఔర్ రాణీకి ప్రేమ్ కహానీ" సినిమా షూటింగ్ ను ఆపివేశారు.
Also Read : రేపు అర్థరాత్రి నుంచి ఏపీఎస్ ఆర్టీసీ సమ్మె
కరణ్ జోహార్ నిర్మిస్తున్న ఈ సినిమాలో రణవీర్ సింగ్, ఆలియా భట్ లు హీరో హీరోయిన్లుగా నటిస్తుండగా.. ప్రీతి జింటా, ధర్మేంద్ర, షబానా అజ్మీ తదితరులు కీలక పాత్రలను పోషిస్తున్నారు. కాగా.. ఇటీవలే షబానా కూడా కరోనా బారిన పడ్డారు. గతేడాది అమితాబ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యరాయ్, ఆరాధ్యలకు కరోనా సోకింది.
Next Story

