అట్టర్ ప్లాప్ అయినా ఆ సీక్వెల్స్ వదలవా?
బుల్లితెర యాంకర్ గా పరిచయమైన ఓం కార్.. రాజుగారి గది సినిమాతో దర్శకుడు అవతారమెత్తాడు. రాజుగారి గది తర్వాత కొత్త సినిమాలేవీ ట్రై చెయ్యకుండా రాజుగారి గదికి [more]
బుల్లితెర యాంకర్ గా పరిచయమైన ఓం కార్.. రాజుగారి గది సినిమాతో దర్శకుడు అవతారమెత్తాడు. రాజుగారి గది తర్వాత కొత్త సినిమాలేవీ ట్రై చెయ్యకుండా రాజుగారి గదికి [more]
బుల్లితెర యాంకర్ గా పరిచయమైన ఓం కార్.. రాజుగారి గది సినిమాతో దర్శకుడు అవతారమెత్తాడు. రాజుగారి గది తర్వాత కొత్త సినిమాలేవీ ట్రై చెయ్యకుండా రాజుగారి గదికి సీక్వెల్ గా రాజుగారి గది 2 ని భారీ స్టార్స్ అయిన నాగార్జున, సమంతలతో తెరకెక్కించి హిట్ కొట్టాడు. ఆ సినిమాలు హిట్ అవడంతో.. ఓం కార్ మళ్ళి రాజుగారి గది 3 కి భారీగా ప్లాన్ చేసారు. అయితే ప్రాజెక్ట్ మొదలు కాగానే హీరోయిన్ తమన్నా తప్పుకోవడంతో మరో హీరోయిన్ ని పెట్టి సినిమాని లాగించేవారు. ఆ సినిమా అట్టర్ ప్లాప్ అయ్యింది. అప్పటినుండి సైలెంట్ గా ఉంటున్న ఓం కార్.. మరో కొత్త కథను ప్లాన్ చేస్తున్నాడేమో అనుకున్నారు.
కానీ తాజాగా ఓం కార్ మళ్ళి రాజుగారి గది కి సీక్వెల్ ప్లాన్ చేస్తున్నాడట. అంటే రాజుగారి గది 4 అన్నమాట. మరి హర్రర్ కథలతో ఎన్ని సినిమాలు తీసినా ప్రేక్షకులు కథలో బలముంటే ఆదరిస్తారు కానీ.. సినిమా కథలో బలం లేకపోతె ప్రేక్షకులు తిప్పికొడతారనేది రాజునాగరి గది సినిమా సీక్వెల్స్ చూస్తే అర్ధమవుతుంది. మరి రాజుగారికి గది 3 అట్టర్ ప్లాప్ అయ్యాక ఆ సీరీస్ లో వచ్చే సినిమాలపై క్రేజ్ ఏం ఉంటుంది. మరి మళ్ళి ఓం కార్ అదే కథతో రాజుగారి గది 4 ప్లాన్ చెయ్యడం కరెక్టో.. కాదో.. కానీ ఈ సినిమా ఈ ఏడాది చివరి నుండి పట్టాలెక్కే ఛాన్స్ ఉంది అంటున్నారు.
- Tags
- Raju gari Gadi 4