Mon Dec 08 2025 18:00:41 GMT+0000 (Coordinated Universal Time)
రజనీ పక్కన మళ్లీ సీనియర్ హీరోయిన్

కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న సినిమాకు హీరోయిన్ ను సెట్ చేశారు. కాలా సినిమాలో లానే ఈ సినిమాలోనూ రజనీ పక్కన నటించేందుకు సీనియర్ హీరోయిన్ సిమ్రన్ ను ఎంపిక చేశారు. సిమ్రన్ ఒకప్పుడు తెలుగు, తమిళ చిత్రాల్లో ఒక రేంజ్ లో మెరిశారు. తమిళ్ అగ్ర మీరోలైన కమల్ హాసన్, సూర్య, విజయ్, అజీత్, విజయ్ కాంత్ సరసన ఆమె నటించినా ఎప్పుడూ రజనీకాంత్ పక్కన నటించే అవకాశం దక్కలేదు. అయితే, ఇప్పుడు ఆమెకు ఈ అవకాశం వచ్చింది. ప్రస్థుతం డార్జీలింగ్ లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రానికి ఇంకా టైటిల్ ఫిక్స్ చేయలేదు. త్వరలోనే షూటింగ్ లో సిమ్రన్ కూడా చేరనుంది. సన్ పిక్చర్స్ పతాకంపై నిర్మిస్తున్న ఈ చిత్రంలో నటులు విజయ్ సేతుపతి, బాబీ సిన్హా, సనంత్ కూడా నటిస్తున్నారు.
Next Story

