Thu Mar 19 2026 13:14:11 GMT+0530 (India Standard Time)
170వ చిత్రం: పవర్ ఫుల్ పోలీసుగా రజనీకాంత్
సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన తాజా చిత్రం జైలర్ బాక్సాఫీస్ వద్ద మంచి

సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన తాజా చిత్రం జైలర్ బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబడుతోంది. రజనీ తదుపరి చిత్రం.. తన కుమార్తె ఐశ్వర్య రజనీకాంత్ చేస్తున్న “లాల్ సలామ్”. ఈ సినిమాలో అతిథి పాత్రలో రజనీకాంత్ కనిపిస్తారంటే. ఇప్పటికే ఆయన తన రోల్ కు సంబంధించిన షూటింగ్ పూర్తీ చేసేశారు.
ఇప్పుడు రజనీకాంత్ 170వ చిత్రంపై భారీ అప్డేట్ వచ్చింది. ఈ చిత్రంలో ఆయన పవర్ ఫుల్ పోలీసు పాత్రలో కనిపించబోతున్నారు. ఈ చిత్రంలో సూపర్‌స్టార్ రజనీకాంత్ బూటకపు ఎన్కౌంటర్ శిక్షను వ్యతిరేకించే పోలీసుగా కనిపిస్తారని అంటున్నారు. ఈ పాత్ర చాలా ఇంటెన్స్‌గా ఉంటుందని, రజనీ క్యారెక్టర్ సూపర్ గా ఉంటుందని తెలిపారు. ఈ సినిమా దర్శకుడి మునుపటి చిత్రం జై భీమ్. సూర్య ప్రధాన పాత్ర పోషించారు. ఈ సినిమాలో సూర్య పోలీసులకు వ్యతిరేకంగా పోరాడుతాడు. ఈ సినిమాలో బిగ్ బి అమితాబ్ బచ్చన్ ఓ కీలక పాత్రలో నటించనున్నాడని ఇప్పటికే వార్తలు వచ్చాయి. ఫహద్ ఫాసిల్, మంజు వారియర్, శర్వానంద్ కూడా ఈ సినిమాలో భాగమని పుకార్లు వచ్చాయి. ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. 2024లో విడుదల కానుంది.
Next Story

