రాజశేఖర్ కండిషన్ క్రిటికల్ కాదు..?
గత వారం హీరో రాజశేఖర్ కుటుంబం మొత్తం కరోనా బారిన పడినట్లుగా రాజశేఖర్ కూతుళ్లు శివాని, శివాత్మికలు మీడియాకి స్వయానా విషయం చెప్పారు. అయితే తర్వాత కరోనా [more]
గత వారం హీరో రాజశేఖర్ కుటుంబం మొత్తం కరోనా బారిన పడినట్లుగా రాజశేఖర్ కూతుళ్లు శివాని, శివాత్మికలు మీడియాకి స్వయానా విషయం చెప్పారు. అయితే తర్వాత కరోనా [more]
గత వారం హీరో రాజశేఖర్ కుటుంబం మొత్తం కరోనా బారిన పడినట్లుగా రాజశేఖర్ కూతుళ్లు శివాని, శివాత్మికలు మీడియాకి స్వయానా విషయం చెప్పారు. అయితే తర్వాత కరోనా నుండి తాము కోలుకున్నట్టుగా చెప్పారు. తాజాగా రాజశేఖర్ కరోనా పోరాటంలో ఆయన కండిషన్ క్రిటికల్ గా ఉందని… లంగ్స్ లో ఇన్ఫెక్షన్ తగ్గలేదని, రాజశేఖర్ పరిస్థితి బాలేదని ఆయన కూతురు సోషల్ మీడియాలో ట్వీట్ చెయ్యడంతో అయన అభిమానులు రాజశేఖర్ కోలుకోవాలనంటూ పూజలు మొదలు పెట్టారు. అయితే రాజశేఖర్ కరోనా తో పోరాటం చేస్తున్నారని.. దానికి అయన చాలా ఇబ్బంది పడుతున్నారని మాత్రమే శివాత్మిక ట్వీట్ ఉంది.
కానీ ఆయన కండిషన్ సీరియస్ అంటూ.. మీడియాలో వార్తలు రావడంతో తండ్రి ఆరోగ్యంపై మరింత స్పష్టతనిస్తూ శివాత్మిక మరో ట్వీట్ చేసింది… తన తండ్రి ఆరోగ్యంగానే ఉన్నారని.. మీ ప్రేమ ప్రార్థనల పట్ల కేవలం కృతజ్ఞతలు చెబితే సరిపోదు. కాకపోతే. ఇక్కడ విషయం ఏమంటే.. మా తండ్రి గారి పరిస్థితి విషమంగా లేదు. ప్రస్తుతం అయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉంది.. అంతేకాదు కోలుకుంటున్నారు కూడా. మీకు మరోసారి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. నాన్న ఆరోగ్య పరిస్థితిపై అసత్యవార్తలను ప్రచారం చేయకండి అంటూ ట్వీట్ చెయ్యడంతో రాజశేఖర్ పరిస్థితిపై అందరికి క్లారిటీ వచ్చింది.
- Tags
- Hero Rajasekhar