Thu Jan 08 2026 18:16:01 GMT+0000 (Coordinated Universal Time)
ఏపీలో రాజా సాబ్ టిక్కెట్ ధరల పెంపు
ఆంధ్రప్రదేశ్ లో రాజాసాబ్ సినిమా టిక్కెట్ ధరలను పెంచుకోవడానికి ప్రభుత్వం అనుమతిచ్చింది

ఆంధ్రప్రదేశ్ లో రాజాసాబ్ సినిమా టిక్కెట్ ధరలను పెంచుకోవడానికి ప్రభుత్వం అనుమతిచ్చింది. ఆంధ్రప్రదేశ్ లో రాజాసాబ్ ప్రీమియర్ షో టిక్కెట్ ధరలను పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఎల్లుండి నుంచి పది రోజుల వరకూ పెంచిన టిక్కెట్లను అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది. రేపు ప్రీమియర్ టిక్కెట్ ధరలను ఒక్కొక్కటి వెయ్యి రూపాయలుగా నిర్ణయించింది.
ప్రీమియర్ షో టిక్కెట్...
తర్వాత సింగిల్ స్క్రీన్ టిక్కెట్ ధరను 150 రూపాయలుగా నిర్ణయించింది. మల్టీ ప్లెక్స్ లో టిక్కెట్ ధరను రెండు రూపాయలు పెంచుకోవడానికి అనుమతి ఇచ్చింది. ప్రభాస్ నటించిన రాజాసాబ్ ఈ నెల 9వ తేదీన విడుదల కానుంది. మారుతి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాపై ఇప్పటికే డార్లింగ్ అభిమానుల్లో అంచనాలు భారీగా పెరిగాయి. రేపు సాయంత్రం ఆరు గంటల నుంచి అర్ధరాత్రి వరకూ ప్రీమియర్ షోలకు అనుమతిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
Next Story

