రాజమౌళి పక్కా ప్లానింగ్!
రాజమౌళి దర్శకత్వంలో స్టార్ హీరోస్ తారక్ – రామ్ చరణ్ కలయికలో రూపొందుతున్న పాన్ ఇండియా ఫిలిం ఆర్ ఆర్ ఆర్ అక్టోబర్ లో దసరా పండగ [more]
రాజమౌళి దర్శకత్వంలో స్టార్ హీరోస్ తారక్ – రామ్ చరణ్ కలయికలో రూపొందుతున్న పాన్ ఇండియా ఫిలిం ఆర్ ఆర్ ఆర్ అక్టోబర్ లో దసరా పండగ [more]
రాజమౌళి దర్శకత్వంలో స్టార్ హీరోస్ తారక్ – రామ్ చరణ్ కలయికలో రూపొందుతున్న పాన్ ఇండియా ఫిలిం ఆర్ ఆర్ ఆర్ అక్టోబర్ లో దసరా పండగ సందర్భంగా విడుదలకు రెడీ చేస్తున్నట్లుగా డేట్ ప్రకటించారు రాజమౌళి. అప్పటినుండి RRR పై అందరిలోనూ అంచనాలు. పాన్ ఇండియా లెవల్లో ఐదు భాషల్లో విడుదల కాబోతున్న RRR పై అన్ని భాషల్లోనూ భారీ క్రేజ్ ఉంది. బాహుబలి సినిమాతో పాన్ ఇండియా ని ఓ ఊపు ఊపిన రాజమౌళి మరోసారి RRR తో అందరిలో ఆసక్తి పెంచేశారు. అందులోనూ భీం, రామ రాజు వీడియోస్ అందరిని విశేషంగా ఆకట్టుకున్నాయి. అలాగే RRR పై అంచనాలు కూడా పెంచేసాయి.
అయితే RRR షూటింగ్ ప్రస్తుతం చివరి దశలో ఉండగా ఈ నెలలో RRR చిత్రీకరణ ఓ కొలిక్కి వస్తుంది అని. మార్చ్ నుండి పోస్ట్ ప్రొడక్షన్ తో పాటుగా గ్రాఫిక్స్ లాంటి వర్క్స్ మొదలు పెట్టేసి.. సినిమా ప్రమోషన్స్ స్టార్ట్ చెయ్యబోతుందట RRR టీం. రాజమౌళి కి పబ్లిసిటీ మీద ఉన్న ప్లానింగ్ ఏ రేంజ్ లో ఉంటుందో బాహుబలితో నిరూపితమైంది. సినిమా తెరకెక్కించడం ఒక ఎత్తు.. అది జనాల్లోకి తీసుకోళ్లడం మరో ఎత్తు. అందుకే రాజమౌళి సినిమాల ప్రమోషన్స్ విషయంలో ఎక్కడా తగ్గడు. ప్రస్తుతం RRR ప్రమోషన్స్ విషయంలోనూ రాజమౌళి పక్కా ప్రణాళికలు వేస్తున్నారట. ఐదు భాషా నటులు RRR లో నటించడం, RRR ని ఐదు భాషల్లో రిలీజ్ చెయ్యడంతో.. ఐదు భాషల్లోనూ సినిమా ప్రమోషన్స్ ని ప్లాన్ చేస్తుందట. అన్నిటికన్నా బాలీవుడ్ లో మరిన్ని ప్రమోషన్స్ ఉండేలా చూస్తున్నారట.
RRR ప్రమోషన్స్ తోనే సినిమాపై క్రేజ్ తేవాలని రాజమౌళి ప్లాన్ అట. ఈ కార్యక్రమాలను మార్చి లోనే మొదలు పెట్టబోతున్నారట. ఒక్కో నెలలో ఒక్కో ప్రమోషన్స్ ఉండేలా ప్లాన్ చేస్తున్నారట. సినిమా రిలీజ్ దగ్గరపడేటప్పుడు మరోసారి ఆయా భాషల ప్రమోషన్స్ కార్యక్రమాలు చేపడతారట. అలాగే RRR విడుదల తర్వాత కూడా ఈ ప్రమోషన్స్ కంటిన్యూ చేసేలా రాజమౌళి ప్లానింగ్ ఉన్నాయని చెబుతున్నారు.