రాజమౌళి నువ్వు కేకయ్య!!
కరోనా కారణంగా బ్రేకులు పడ్డ RRR షూటింగ్ మల్లి మొదలై 50 రోజులు పూర్తి చేసుకుంది. ఎక్కడా ఎలాంటి గ్యాప్ లేకుండా రాజమౌళి RRR భారీ యాక్షన్ [more]
కరోనా కారణంగా బ్రేకులు పడ్డ RRR షూటింగ్ మల్లి మొదలై 50 రోజులు పూర్తి చేసుకుంది. ఎక్కడా ఎలాంటి గ్యాప్ లేకుండా రాజమౌళి RRR భారీ యాక్షన్ [more]
కరోనా కారణంగా బ్రేకులు పడ్డ RRR షూటింగ్ మల్లి మొదలై 50 రోజులు పూర్తి చేసుకుంది. ఎక్కడా ఎలాంటి గ్యాప్ లేకుండా రాజమౌళి RRR భారీ యాక్షన్ సీక్వెన్స్ చుట్టేశాడు.రాజమౌళితో పెట్టుకుంటే హీరోలు లాక్ అవ్వాల్సిందే. జక్కన్న చెక్కిందే చెక్కుతాడు. కానీ ఇప్పుడు నైట్ ఎఫెక్ట్స్ లో 50 రోజుల్లో భారీ యాక్షన్ సీక్వెన్స్ ని రాజమౌళి సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసాడు. తుఫాను కారణముగా ఎముకలు కొరికేసే చలి. విపరీతమైన చలి టైం లో రాజమౌళి RRR నైట్ షూట్స్ ని 50 రోజుల పాటు ఏకధాటిగా చిత్రీకరించాడట.
రాజమౌళి కష్టాన్ని, RRR యూనిట్ కష్టాన్ని ఎప్పటికప్పుడు RRR గ్లిమ్బ్స్ రూపంలో సోషల్ మీడియాలో షేర్ చేస్తున్న వీడియోస్ చూస్తే రాజమౌళి కష్టం కళ్ళకు కట్టినట్టుగా కనబడుతుంది. 50 రోజుల నైట్ షూట్ లో రాజమౌళి ఒక్క యాక్షన్ ఎపిసోడ్ ని పూర్తి చేసి చూపించాడట. ఈ యాక్షన్ ఎపిసోడ్ సినిమాకే హైలెట్ గా నిలవబోతుందట. మరి రాజమౌళి చిన్నపాటి గ్యాప్ తీసుకోకుండా.. ఇలా RRR షూటింగ్ పూర్తి చేస్తుంటే.. ఎన్టీఆర్ అండ్ చరణ్ లు త్వరగానే RRR ఫినిష్ చేస్తారని త్రివిక్రమ్ అండ్ కొరటాల ముందు సంతోష పడిపోతున్నారట. ఇక రాజమౌళి ఎలా ఏకధాటిగా భారీ షెడ్యూల్ పూర్తి చెయ్యడం చూసిన వారు రాజమౌళి నువ్వు కేకయ్య అంటున్నారట.