హీరోల చేతిలో రాజమౌళి అందుకే తిట్లు తినేది!!
రాజమౌళి హీరోలను ఎంత టార్చెర్ పెడతాడో.. హీరోలు రాజమౌళి వలన ఎంత ఇబ్బందులు పడతారో అనే విషయం రాజమౌళి పుట్టిన రోజునాడు ఆయనతో పని చేస్తున్న ఎన్టీఆర్, [more]
రాజమౌళి హీరోలను ఎంత టార్చెర్ పెడతాడో.. హీరోలు రాజమౌళి వలన ఎంత ఇబ్బందులు పడతారో అనే విషయం రాజమౌళి పుట్టిన రోజునాడు ఆయనతో పని చేస్తున్న ఎన్టీఆర్, [more]
![salman recomends heroin for rrr movie salman recomends heroin for rrr movie](https://www.telugupost.com/h-upload/old_images/1188441-ssrajamouli.webp)
రాజమౌళి హీరోలను ఎంత టార్చెర్ పెడతాడో.. హీరోలు రాజమౌళి వలన ఎంత ఇబ్బందులు పడతారో అనే విషయం రాజమౌళి పుట్టిన రోజునాడు ఆయనతో పని చేస్తున్న ఎన్టీఆర్, రామ్ చరణ్ లు క్లియర్ గా ఓ వీడియో లో చూపించారు. హీరోలే కాదు.. టెక్నీకల్ టీం కూడా రాజమౌళి రాక్షసత్వం గురించి ఫన్నీ వీడియో చేసారు. మరి రాజమౌళి అంటే పని రాక్షసుడు. అది మాత్రం నిజం. తాజాగా RRR టీం విడుదల చేసిన ఓ వీడియో చూస్తే మీరు అది నిజమని ఒప్పేసుకుంటారు.
కరోనా వలన మధ్యలో ఆగిన RRR షూటింగ్ ఈ మధ్యనే మొదలయ్యింది. RRR షూటింగ్ మొదలైనప్పటినుండి రాజమౌళి కి నిద్ర లేదు. రాజమౌళికేనా ఆయన టీం కి ఆఖరుకు హీరోలకి కూడా. హీరోలతోను, టెక్నీకల్ టీం తోను రాత్రిపగలు పని చేయిస్తున్నాడు రాజమౌళి. RRR మేకింగ్ గ్లిమ్బ్స్ తో రాజమౌళి ఆయన టీం కష్టాలు ఒక్కక్కటిగా బయట పడుతున్నాయి. టీం తాజాగా విడుదల చేసిన వీడియోలో చలికి గజగజ ఒణుకుతున్న RRR టీం అండ్ హీరో ఎన్టీఆర్ అందరూ అర్ధవరాత్రి వరకు RRR షూటింగ్ కోసం సమయం వెచ్చిస్తున్నారు. చలి పులి నగరాన్ని వణికిస్తున్న నేపథ్యంలో RRR టీం చలికి వణుకుతూనే షూటింగ్ పూర్తి చేస్తున్నారు.
మరి రాజమౌళి స్పాట్ లో ఉంటె హీరోలు కూడా ఉండాల్సిందే. తాను అనుకున్న షూటింగ్ ఓ కొలిక్కి వచ్చేవరకు హీరోలను నిద్రపోనివ్వడు రాజమౌళి. అందుకే హీరోలకు రాజమౌళి మీద కోపం ఉండేది. ఆ కోపం కూడా ప్రేమతో కూడుకున్నదే. అందుకే అంటారు రాజమౌళి సినిమా అంటే మజాక్ కాదని.