Mon Feb 02 2026 03:21:11 GMT+0000 (Coordinated Universal Time)
Raj Tarun Lavanya: సంచలన ఆధారాలను పోలీసులకిచ్చిన లావణ్య
హీరో రాజ్ తరుణ్-లావణ్య వ్యవహారం సినిమా కథను తలపిస్తోంది

హీరో రాజ్ తరుణ్-లావణ్య వ్యవహారం సినిమా కథను తలపిస్తోంది. తాజాగా లావణ్య నార్సింగి పోలీసులకు పలు ఆధారాలను సమర్పించారు. హీరోయిన్ మాల్వీ మల్హోత్రా మోజులో పడి రాజ్ తరుణ్ తనను వదిలేసి వెళ్లిపోయాడని లావణ్య ఆరోపిస్తూ.. తన ఫిర్యాదులకు సంబంధించిన ఆధారాలను పోలీసులకు అందించారు. లావణ్య పోలీసులకు 170 ఫొటోలను, పలు టెక్నికల్ ఆధారాలను అందించడంతో రాజ్ తరుణ్ పై నార్సింగి పోలీస్ స్టేషన్ లో పలు సెక్షన్స్ కింద కేసు నమోదు చేశారు.
రాజ్ తరుణ్ తో పదేళ్ల క్రితమే పెళ్లయిందని, అప్పటి నుంచి తాము కలిసే ఉంటున్నామని లావణ్య చెబుతన్నారు. అన్విక పేరుతో తాను రాజ్ తరుణ్ తో కలిసి విదేశాలకు కూడా వెళ్లామని.. రాజ్ తరుణ్ తనకు అబార్షన్ చేయించాడని లావణ్య తెలిపారు. మాల్వీ మల్హోత్రా వచ్చిన తర్వాత రాజ్ తరుణ్ తనను దూరం పెట్టాడని ఆరోపించారు లావణ్య. నన్ను రెచ్చగొట్టి ఉద్దేశపూర్వకంగా వాయిస్ రికార్డు చేశాడని ఆరోపించారు లావణ్య.
లావణ్య తనకు, తన సోదరుడికి అనుచిత సందేశాలు పంపిందని, తనపై తప్పుడు పుకార్లు వ్యాప్తి చేస్తానని బెదిరిస్తోందని ఆరోపిస్తూ నటి మాల్వీ మల్హోత్రా ఫిలింనగర్ పోలీస్ స్టేషన్లో లావణ్యపై ఫిర్యాదు చేసింది. మాల్వీ ఫిర్యాదు మేరకు ఫిలింనగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. లావణ్య మొదట ఫిర్యాదు చేసిన తర్వాత.. లావణ్యకు మరో ప్రేమ వ్యవహారంలో ప్రమేయం ఉందని రాజ్ తరుణ్ ఆరోపించారు. మాల్వీతో తనకు ఎలాంటి సంబంధం లేదని రాజ్ తరుణ్ స్పష్టం చేశాడు.
Next Story

