Thu Jan 29 2026 05:19:53 GMT+0000 (Coordinated Universal Time)
Anant Ambani: అనంత్ అంబానీకి రాధికా చెప్పిన.. ఎమోషనల్ డైలాగ్ మూవీలోనిదా..!
ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ లో అనంత్ అంబానీకి రాధికా మర్చంట్ చెప్పిన ఎమోషనల్ డైలాగ్ హాలీవుడ్ మూవీ నుంచి కాపీ కొట్టారా?

Anant Ambani - Radhika Merchant : అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ తమ చిన్ననాటి ప్రేమని గెలిపించుకుంటూ.. పెళ్లి జీవితం మొదలు పెట్టబోతున్న సంగతి తెలిసిందే. జులైలో ఏడడుగులు వేయబోతున్న ఈ జంట.. ఇటీవల ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ ని గ్రాండ్ గా జరుపుకున్నారు. అపరకుబేరుడైన ముకేశ్ అంబానీ.. తన ముద్దుల కొడుకు పెళ్లి వేడుకలను అంగరంగ వైభవంగా జరిపేందుకు సిద్ధమయ్యారు.
ఈక్రమంలోనే ఇటీవల జరిగిన ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్కే వేల కోట్లు ఖర్చు చేసారు. ఇక ఈ ఈవెంట్ కి ప్రపంచంలోని కుబేరులు, ప్రముఖలతో పాటు ఇండియాలోని స్టార్స్ కూడా హాజరయ్యి సందడి చేశారు. మూడు రోజులు పాటు జరిగిన ఆ సెలబ్రేషన్స్ కి సంబంధించిన వీడియోలు బయటకి వచ్చి బాగా వైరల్ అయ్యాయి. అలా వైరల్ అయిన వీడియోలో.. అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ స్పీచ్ కూడా ఒకటి.
ఆ సెలబ్రేషన్స్ లో వచ్చిన అతిథులందరి ముందు వేదిక పై అనంత్ అంబానీ.. తన లైఫ్ గురించి, తల్లిదండ్రులు గురించి మాట్లాడి.. తన తండ్రిని ఎమోషనల్ చేశారు. ఇక అనంత్ తరువాత రాధికా మర్చంట్ కూడా పెళ్లి గురించి ఎమోషనల్ డైలాగ్స్ చెప్పారు. రాధికా చెప్పిన మాటలకు ఈవెంట్ లో క్లాప్స్ వచ్చాయి. అయితే ఆ వీడియో చూసిన కొంతమంది నెటిజెన్స్ మాత్రం.. ఆ మాటలు ఎక్కడో విన్నామని తెగ వెతికేసారు.
ఫైనల్లీ ఒరిజినల్ డైలాగ్స్ వీడియో కూడా పట్టుకొచ్చేసారు. ఆ డైలాగ్స్ ఓ హాలీవుడ్ మూవీలోనిది. 2004లో రిలీజైన 'Shall We Dance' మూవీలో ఒక ఆర్టిస్ట్ చెప్పిన డైలాగ్ ని రాధికా కాపీ చేశారు. ప్రస్తుతం రాధికా డైలాగ్ని, ఒరిజినల్ మూవీ డైలాగ్ని కలిపి నెట్టింట వైరల్ చేస్తూ పలువురు ట్రోల్ వేస్తున్నారు. మరి ఆ డైలాగ్ వీడియోని ఒకసారి మీరుకూడా చూసేయండి.
Next Story

