వెండితెర అవకాశాలు నిల్.. బుల్లితెర అదృష్టం ఎలా ఉందొ?
చైల్డ్ ఆర్టిస్ట్ గా అనేక సినిమాల్లో నటించి, తర్వాత హీరోయిన్ గా మారి మంచి మంచి సినిమాలు చేసిన రాశి బాగా బరువు పెరగడంతో హీరోయిన్ పాత్రలకి [more]
చైల్డ్ ఆర్టిస్ట్ గా అనేక సినిమాల్లో నటించి, తర్వాత హీరోయిన్ గా మారి మంచి మంచి సినిమాలు చేసిన రాశి బాగా బరువు పెరగడంతో హీరోయిన్ పాత్రలకి [more]
చైల్డ్ ఆర్టిస్ట్ గా అనేక సినిమాల్లో నటించి, తర్వాత హీరోయిన్ గా మారి మంచి మంచి సినిమాలు చేసిన రాశి బాగా బరువు పెరగడంతో హీరోయిన్ పాత్రలకి దూరమైంది. తేజ దర్శకత్వంలో మహేష్ హీరోగా గోపీచంద్ విలన్ గా వచ్చిన నిజం సినిమాలో రాశి నెగెటిక్ షేడ్స్ ఉన్న కేరెక్టర్ కూడా చేసింది. హీరోయిన్ గా భారీ గ్యాప్ రావడంతో పెళ్లి చేసుకుని సెటిల్ అయ్యి పాపని కూడా కన్న రాశి మళ్ళీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చింది. హీరోయిన్స్ మథర్ కేరెక్టర్స్ అంటూ మొదలు పెట్టిన రాశి రీ ఎంట్రీ అంతగా సక్సెస్ కాలేదు. నదియా, రమ్యకృష్ణ లాగా సక్సెస్ కాలేక ప్రస్తుతం బుల్లితెర మీదకి వచ్చేసింది. అది కూడా ఏ టాక్ షో తోనో, లేదంటే ఏ స్పెషల్ షో తోనో కాదు.. ఏకంగా రాశి సీరియల్స్ లోకి ఎంట్రీ ఇచ్చింది.
స్టార్ మా లో కొత్తగా మొదలు కాబోతున్న జానకి కలగనలేదు అనే సీరియల్ లో హీరో కి మథర్ కేరెక్టర్ లో చేస్తుంది. ఈ సీరియల్ లో మరో వెండితెర నటుడు రాజా రవీంద్ర కూడా నటించడం విశేషం. హీరోయిన్ ఫాదర్ గా రాజా రవీంద్ర కనిపిస్తుంటే.. రాశి స్వీట్ షాప్ ఓనర్ గా హీరోకి తల్లిగా నటిస్తుంది. తన కొడుక్కి కాబోయే భార్య తన కొడుకు కన్నా ఎక్కువ చదుకున్న అమ్మాయి వద్దని.. ఏ ఏడో, ఎనిమిదో చదివిన అమ్మాయి అయితే చాలని, అలాగే మంచింది, తెలివైనది అయితే చాలని, పొగరున్న అమ్మాయి వద్దనే అమ్మ కేరెక్టర్ లో రాశి కాస్త మాస్ గానే కనబడుతుంది. కొడుకుని చెప్పు చేతల్లో పెట్టుకునే తల్లి కేరెక్టర్ లో రాశి ఈ జానకి కలగనలేదు అనే సీరియల్ లో కనిపించబోతుంది. త్వరలోనే స్టార్ మా లో ఈ సీరియల్ మొదలుకాబోతుంది.
- Tags
- Rasi