Sun Dec 08 2024 06:13:03 GMT+0000 (Coordinated Universal Time)
పుష్ప-2 ఈవెంట్ లో గందరగోళం
విమానాశ్రయం వెలుపల వందలాది మంది అభిమానులు
'పుష్ప 2: ది రూల్' సినిమా ట్రైలర్ లాంచ్కు హాజరయ్యేందుకు సినిమాలో లీడ్ రోల్స్ లో నటించిన అల్లు అర్జున్, రష్మిక మందాన బీహార్లోని పాట్నా చేరుకున్నారు. విమానాశ్రయం వెలుపల వందలాది మంది అభిమానులు పుష్ప జోడీ రాక కోసం కొన్ని గంటలుగా వెయిట్ చేశారు. పాట్నాలో పుష్ప 2 ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో గందరగోళం నెలకొంది. గాంధీ మైదాన్లో పెద్ద ఎత్తున గుమిగూడిన అల్లు అర్జున్ అభిమానులు కుర్చీలు, చెప్పులు కూడా విసిరారు. పోలీసు అధికారులు జనాన్ని అదుపు చేయడం కోసం చాలా కష్టపడ్డారు.
2024లో అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రం పుష్ప 2 కోసం ఎదురుచూపులు పెరుగుతున్నాయి. డిసెంబర్ 5న గ్రాండ్ రిలీజ్కు ముందు అల్లు అర్జున్, రష్మిక మందన్న, ఫహద్ ఫాసిల్ నటించిన పుష్ప 2: ది రూల్ ట్రైలర్ నవంబర్ 17 ఆదివారం విడుదల కానుంది. ఈ కార్యక్రమం పాట్నాలోని గాంధీ మైదాన్లో అట్టహాసంగా నిర్వహించనున్నారు.
Next Story