Sat Dec 07 2024 21:47:01 GMT+0000 (Coordinated Universal Time)
Pushpa 2 Trailer: క్రేజీ అప్డేట్.. పుష్ప-2 ట్రైలర్ ఎంత నిడివి ఉందంటే?
ఈ సినిమా ట్రైలర్ కు ముహూర్తం పెట్టారు
దేశవ్యాప్తంగా ఉన్న మూవీ లవర్స్ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న సినిమా పుష్ప-2. ఈ సినిమా ట్రైలర్ కు ముహూర్తం పెట్టారు. అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 దేశ వ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్న చిత్రాలలో ఒకటి. ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ సినిమాలో నటి శ్రీలీల ఓ ప్రత్యేక పాట చేస్తోంది. ట్రైలర్ విడుదల కోసం అభిమానులు, ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పుష్ప 2 ట్రైలర్ కూడా 2 నిమిషాల 44 సెకన్ల రన్టైమ్లో లాక్ చేసినట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది.
ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ నవంబర్ 17న పాట్నాలో జరగనుంది. ట్రైలర్ సాయంత్రం 6:30 గంటలకు యూట్యూబ్లో విడుదల కానుంది. సినిమాకు భారీ హైప్ వచ్చేలా పలు ప్రాంతాల్లో ఈవెంట్స్ ని భారీగా ప్లాన్ చేస్తున్నారు. ట్రైలర్ పూర్తిగా మాస్ తో ఉంటుందని మేకర్స్ ప్రకటించారు. అల్లు అర్జున్ కూడా పుష్ప 2లో మరోసారి తన అద్భుత నటనను ప్రదర్శించేందుకు సిద్ధమవుతున్నాడు.
ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద 1000 కోట్ల మార్కును సులువుగా చేరుకునేలా మేకర్స్ అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. సినిమా విడుదలకు ఒక నెల కంటే తక్కువ సమయం ఉంది. డిసెంబర్ 5 న విడుదల చేయడానికి షెడ్యూల్ చేశారు. ఈ చిత్రం ప్రారంభ రోజున భారతదేశం అంతటా, ప్రపంచవ్యాప్తంగా భారీ ఓపెనింగ్స్ పక్కా అని చెబుతున్నారు. పుష్ప గాడి రూల్ ఏంటో వెండితెర మీద చూడడానికి అందరూ సిద్ధమైపోతున్నారు.
Next Story