Mon Oct 14 2024 06:33:23 GMT+0000 (Coordinated Universal Time)
Pushpa 2: ఓ వైపు పుష్ప-3 హింట్స్.. పుష్ప-2 రిలీజ్ ఆరోజే పక్కా
అల్లు అర్జున్-సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా పుష్ప-2
అల్లు అర్జున్-సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా పుష్ప-2. ఈ సినిమా మీద ఉన్న హైప్ అంతా ఇంతా కాదు. ముఖ్యంగా నార్త్ ఇండియాలో పుష్ప-2 సినిమా కోసం ఎంతగానో ఎదురుచూస్తూ ఉన్నారు. పుష్ప-2 లో ఏ క్యారెక్టర్ ఏమవుతుందా అనే క్యూరియాసిటీ ప్రతి ఒక్కరిలోనూ ఉంది. ఇక ఇటీవల 'మారుతీనగర్ సుబ్రహ్మణ్యం' సినిమా ప్రమోషన్స్ లో నటుడు రావు రమేష్ కూడా పుష్ప-3 గురించి హింట్స్ అయితే ఇచ్చారు. తాను కాల్షీట్స్ ఇచ్చానని వాటిని పుష్ప, పుష్ప-2 కోసం వాడుకున్నారని, మిగిలినవి తర్వాత కోసం అంటూ పుష్ప-3 గురించి హింట్ ఇచ్చారు.
అయితే పుష్ప-2 ఇప్పటికే పలుమార్లు వాయిదా పడుతూ వచ్చింది. ఆగస్టు 15న పుష్ప-2 విడుదల అవ్వాల్సి ఉండగా అనుకోని కారణాల వల్ల రిలీజ్ వాయిదా పడింది. అయితే ఇక సినిమా వాయిదా పడే అవకాశాలు లేవని.. చెప్పిన డేట్ కు తప్పకుండా విడుదల చేస్తామని చిత్ర యూనిట్ తెలిపింది. ఈ సినిమా డిసెంబర్ 6వ తేదీన తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో అత్యంత భారీ స్థాయిలో విడుదల కాబోతోంది. మైత్రి మూవీ మేకర్స్ అండ్ సుకుమార్ రైటింగ్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, ఎలమంచిలి రవిశంకర్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా బాక్సాఫీసును షేక్ చేయబోతోందనే అంచనాలు భారీగా ఉన్నాయి.
Next Story