Fri Dec 05 2025 23:16:07 GMT+0000 (Coordinated Universal Time)
Pawan Kalyan : పవన్ ఫ్యాన్స్ కు మళ్లీ నిరాశ తప్పదా? అదే జరిగితే?
జూన్ 12వ తేదీన హరిహరవీరమల్లు విడుదల చేస్తామని ఇప్పటికే నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమా అంటే ఫ్యాన్స్ ఊగిపోతారు. ఆయన రాజకీయాల్లో బిజీగా మారిపోవడంతో ఇక సినిమాలు రావన్న నిరాశతో ఉన్న వారికి ఆయన ఎన్నికలకు ముందు అగ్రిమెంట్ చేసిన మూవీలు ఒక్కొక్కటిగా విడుదలయ్యేందుకు సిద్ధమవుతున్నాయి. అందులో భాగంగా పవన్ కల్యాణ్ నటించి హరిహర వీరమల్లు పై కూడా మంచి హైప్ క్రియేట్ అయింది. పవన్ కల్యాణ్, క్రిష్ కాంబోలో ఈ మూవీకి సంబంధించి షూటింగ్ లో కూడా పవర్ స్టార్ పాల్గొన్నారు. ఇక మూవీ రిలీజ్ కు సిద్ధమయింది.
డేట్ ప్రకటించినా...
జూన్ 12వ తేదీన హరిహరవీరమల్లు విడుదల చేస్తామని ఇప్పటికే నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. అంటే ఇంకాపెద్దగా సమయం లేదు. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్స్ తో పాటు పవన్ కల్యాణ్ పాడిన పాట కూడా జనంలోకి వెళ్లడంతో బాక్సాఫీసు వద్ద బద్దలు కొట్టడం ఖాయమన్న అభిప్రాయంలో ఫ్యాన్స్ ఉన్నారు. జూన్ 12వ తేదీన రెండు తెలుగు రాష్ట్రాల్లో విడుదలవుతున్న ఈ మూవీని చూసేందుకు అభిమానులు తహతహలాడుతున్నారు. ఇక ఇదే సమయంలో పవన్ ఫ్యాన్స్ కు షాకింగ్ న్యూస్ ఒకటి తెలియడంతో మళ్లీ సినిమా వాయిదా పడుతుందన్న అనుమానం కలుగుతుంది.
థియేటర్ల సమ్మెతో...
రెండు తెలుగు రాష్ట్రాల్లోని ఎగ్జిబిటర్లు నిన్న ఫిలిం ఛాంబర్ లో సమావేశమై కీలక నిర్ణయం తీసుకున్నారు. జూన్ ఒకటి నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లో సినిమా థియేటర్లు బంద్ చేయాలని నిర్ణయించారు. థియేటర్లను అద్దె ప్రాతిపదికన కాకుండా ఇకపై పర్సంటేజీ చెల్లించాలన్న డిమాండ్ తో ఎగ్జిబిటర్లు ఈనిర్ణయం తీసుకున్నారు. జూన్ 1వ తేదీ నుంచి సినిమా థియేటర్లు బంద్ అయితే ఇక పవన్ సినిమా హరిహర వీరమల్లు కూడా వాయిదా పడుతుందేమోనన్న అనుమానం మాత్రం ఫ్యాన్స్ లో బయలుదేరింది. కానీ థియేటర్లు మూసివేయడం అంత సులువు కాదని, ఈ సమస్యకు పరిష్కారం దొరికి థియేటర్లు యధాతథంగా నడుస్తాయని, జూన్ 12న తమ అభిమాన హీరో పవన్ కల్యాణ్ మూవీ హరిహర వీరమల్లు రిలీజ్ అవుతుందని భావిస్తున్నారు.
Next Story

