Tollywood : టాలీవుడ్ లో మరో విషాదం.. నిర్మాత మృతి
తెలుగు సినీ చిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. నిర్మాత కోనేరు మహేశ్ మృతి చెందారు. విశాఖపట్నంలో ఆయన ఈరోజు ఉదయం గుండెపోటుతో మృతి చెందారు. [more]
తెలుగు సినీ చిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. నిర్మాత కోనేరు మహేశ్ మృతి చెందారు. విశాఖపట్నంలో ఆయన ఈరోజు ఉదయం గుండెపోటుతో మృతి చెందారు. [more]
తెలుగు సినీ చిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. నిర్మాత కోనేరు మహేశ్ మృతి చెందారు. విశాఖపట్నంలో ఆయన ఈరోజు ఉదయం గుండెపోటుతో మృతి చెందారు. తెలుగులో ఆయన ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్ పేరుతో అనే చిత్రాలను కోనేరు మహేశ్ నిర్మించారు. తిమ్మరుసు, మిస్ ఇండియా, 118 వంటి చిత్రాలకు కోనేరు మహేశ్ నిర్మాతగా వ్యవహరించారు. ఆయన చాలా కాలం సినీ హీరో నందమూరి కల్యాణ్ రామ్ వద్ద పీఆర్వోగా పనిచేశారు.
నమ్మశక్యంగా లేదు….
కోనేరు మహేశ్ మృతి పట్ల టాలివుడ్ ప్రముఖులు సంతాపం తెలియజేశారు. కోనేరు మహేశ్ మృతి తనకు వ్యక్తిగతంగా తీరని లోటని, ఒక ఆప్తమిత్రుడిని కోల్పోయానని జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్ చేశారు. ఆయన మృతిని తాను నమ్మలేకపోతున్నానని జూనియర్ ఎన్టీఆర్ అన్నారు.