Wed Mar 18 2026 20:24:52 GMT+0530 (India Standard Time)
Producer: చిత్ర పరిశ్రమలో విషాదం: ప్రముఖ నిర్మాత కన్నుమూత
తమిళ చిత్ర పరిశ్రమలో విషాదం

తమిళ చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది. తమిళ సినీ నిర్మాత డిల్లీ బాబు సెప్టెంబర్ 9 తెల్లవారుజామున చెన్నైలో మరణించారు. ఆయన వయస్సు 50 సంవత్సరాలు. సన్నిహిత వర్గాల సమాచారం ప్రకారం తెల్లవారుజామున 12.30 గంటలకు కన్నుమూశారు. ఆయన అంత్యక్రియలు సెప్టెంబర్ 9 న నిర్వహించనున్నారు. డిల్లీ బాబు అనారోగ్యం కారణంగా కొంతకాలంగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆరోగ్యం విషమించడంతో ఆయన కన్నుమూశారు.
యాక్సెస్ ఫిల్మ్ బ్యానర్ పై ఆయన ఎన్నో చిత్రాలను నిర్మించారు. ఢిల్లీ బాబు నిర్మించిన బ్యాచిలర్, ఓ మై గాడ్, రాక్షసన్, మరకతమణి, మిరల్ చిత్రాలు ఘన విజయం సాధించాయి. ఆయన నిర్మించిన చిత్రాలు తెలుగులో డబ్ అయి హిట్ కొట్టాయి. కొత్తవారితో సినిమాలు నిర్మించి ఢిల్లీ బాబు ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించారు. 2015లో ఉరుమీన్తో నిర్మాతగా అరంగేట్రం చేశారు ఢిల్లీ బాబు. ఆయన నిర్మిస్తున్న మరికొన్ని తమిళ ప్రాజెక్ట్లు కూడా ప్రొడక్షన్ స్టేజీలో ఉన్నాయి.
Next Story

