Sat Jan 31 2026 05:40:15 GMT+0000 (Coordinated Universal Time)
వచ్చే నెలలోనే ఎంగేజ్ మెంట్..?

బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా, హాలీవుడ్ సింగర్ నిక్ జోనస్ ల పెళ్లి చేసుకోనున్నారా..? వచ్చే నెలలోనే వీరి ఎంగేజ్ మెంట్ జరగనుందా..? అంటే అవుననే అంటున్నాయి బాలీవుడ్ వర్గాలు. వీరిద్దరూ ప్రస్థుతం ఇండియాలోనే ఉండటం, గోవా ట్రిప్ కి వెళ్లడంతో ఇది నిజమేనని అంటున్నారు. ఇందుకోసమే నిక్ ను ప్రియాంక ముంబయికి రప్పించి తన కుటుంబసభ్యులకు పరిచయం చేసింది. తన తల్లి మధు చోప్రాకు నిక్ ను పరిచయం చేసింది. అందరూ కలిసి డిన్నర్ కి కూడా వెళ్లారు. మొత్తం మీద నిక్ ను పెళ్లి చేసుకుంటానని ప్రియాంక తన తల్లిని ఒప్పించిందట. మొదట తన కూతురు విదేశీయుడిని పెళ్లి చేసుకుంటానంటే తాను ఒప్పుకోనని, మొత్తానికే పెళ్లి చేసుకోకున్నాబాధపడనని మధు చోప్రా ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆమె మెత్తబడటంతో జులై ఆఖరి వారం లేదా ఆగష్టు మొదటి వారంలో ఎంగేజ్ మెంట్ జరుపుకోవాలని నిర్ణయించుకున్నారు.
Next Story

