Fri Dec 05 2025 15:45:40 GMT+0000 (Coordinated Universal Time)
OGలో పవన్ సరసన ప్రియాంక మోహన్..
సినిమా షూటింగ్ ముంబైలో మొదలవ్వగా.. పవన్ నిన్నటి నుండే షూటింగ్ లో జాయిన్ అయ్యారు. అందుకు సంబంధించిన..

టాలీవుడ్ హీరో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ వరుస సినిమా షూటింగ్ లతో బిజీగా ఉన్నాడు. 2024 ఎలక్షన్స్ కి కొన్ని నెలల ముందే చేతిలో ఉన్న సినిమాలన్నీ పూర్తిచేసి రాజకీయాలపై పూర్తిగా దృష్టిపెట్టాలని పవన్ చూస్తున్నారు. అందుకే.. ఇప్పటికే ఓకే సినిమాల షూటింగ్స్ అన్నింటినీ లైన్లో పెట్టేశారు. కొన్ని రోజుల క్రితమే వినోదయ సితం రీమేక్ సినిమా షూట్ ని 25 రోజులు వరుస డేట్స్ ఇచ్చి పూర్తి చేశాడు పవన్. ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ కూడా ఫస్ట్ షెడ్యూల్ పూర్తిచేసుకుంది. ఇక తాజాగా They Call Him OG సినిమా సెట్లోకి పవన్ అడుగుపెట్టాడు.
డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మితమవుతున్న ఈ సినిమాకు సుజిత్ దర్శకత్వం వహిస్తున్నాడు. టైటిల్ అనౌన్స్ మెంట్ నుంచీ ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. సినిమా షూటింగ్ ముంబైలో మొదలవ్వగా.. పవన్ నిన్నటి నుండే షూటింగ్ లో జాయిన్ అయ్యారు. అందుకు సంబంధించిన కొన్ని ఫొటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తాజాగా They Call Him OG నుండి మరో అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ సినిమాలో పవన్ సరసన హీరోయిన్ ప్రియాంక మోహన్ నటించనుంది. తెలుగులో శ్రీకారం, నాని గ్యాంగ్ లీడర్ సినిమాలలో నటించిన ప్రియాంక మోహన్.. తమిళ సినిమాలైన డాక్టర్, డాన్ సినిమాలతోనూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడు ఏకంగా పవర్ స్టార్ పక్కన నటించే ఛాన్స్ కొట్టేసింది. ఇలా OG నుండి వరుస అప్డేట్లు వస్తుండటంతో అభిమానులు ఫుల్ ఖుషీగా ఉన్నారు.
Next Story

