Sat Oct 12 2024 06:00:21 GMT+0000 (Coordinated Universal Time)
పుష్ప 2లో ప్రియమణి నటిస్తుందా.. ఆ నటుడికి భార్యగా..
అల్లు అర్జున్ పుష్ప 2 లో ప్రియమణి నటించబోతుందా..? ఆ నటుడికి భార్యగా..
అల్లు అర్జున్ (Allu Arjun) నటిస్తున్న పుష్ప 2 (Pushpa 2) కోసం ఆడియన్స్ ఎంత ఆశగా ఎదురు చూస్తున్నారో అందరికి తెలిసిన విషయమే. దీంతో ఈ మూవీ పై రోజుకో వార్త ఏదోకటి నెట్టింట వైరల్ అవుతుంది. అలాగే ఇటీవల ఒక వార్త సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొట్టింది. అదేంటంటే.. పుష్ప 2 లో విజయ్ సేతుపతి ఒక కీలక పాత్ర చేస్తున్నాడని, అతనికి భార్య పాత్రలో ప్రియమణి నటిస్తుందని ఆ వార్తల సారాంశం.
ఇక ఈ వార్తలు గురించి ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రియమణిని ప్రశ్నించగా, ఆమె క్లారిటీ ఇచ్చింది. ఆ వార్తల్లో ఎటువంటి నిజం లేదని ఆమె చెప్పుకొచ్చింది. సోషల్ మీడియాలో వచ్చే వార్తలు చూసి తాను కూడా ఆశ్చర్యపోయినట్లు పేర్కొంది. ఇక ప్రియమణి ఇచ్చిన క్లారిటీతో ఆ రూమర్స్ అన్నిటికి చెక్ పడినట్లు అయ్యింది. కాగా విజయ్ సేతుపతి ఈ సినిమాలో నటిస్తున్నాడా..? అనేది ఇంకా ప్రశ్నగానే ఉంది.
ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఫహద్ ఫాజిల్ (Fahadh Faasil) మెయిన్ విలన్ గా కనిపించనుండగా ధనంజయ్, సునీల్, అనసూయ కూడా ప్రతినాయకులు పాత్రలో కనిపించబోతున్నారు. అలాగే జగపతిబాబు కూడా ఈ సెకండ్ పార్ట్ లో ఒక ఇంపార్టెంట్ రోల్ చేస్తున్నట్లు వెల్లడించాడు. ఇక ఈ సెకండ్ పార్ట్ ని సుకుమార్ మొదటి భాగాన్ని కంటే గ్రాండ్ గా తెరకెక్కిస్తున్నాడు.
ఎమోషన్ సీన్స్, యాక్షన్ సీక్వెన్స్ ఒక రేంజ్ లో ఉండబోతున్నాయని సుకుమార్ ఇప్పటికే తెలియజేశాడు. ఇక ఇటీవల ఈ మూవీ సెట్స్ లో 100కు పైగా లారీలు కనిపించడం ఆడియన్స్ ని ఆశ్చర్యానికి గురి చేసింది. అందరి అంచనాలకు మించి సుకుమార్ సెకండ్ పార్ట్ ని డిజైన్ చేస్తున్నాడని ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. కాగా ఈ మూవీని వచ్చే ఏడాది సమ్మర్ లో రిలీజ్ చేసే అవకాశం ఉంది అంటున్నారు.
Next Story