చాలా తెలివిగా తప్పించుకుంది
మలయాళం బ్యూటీ ప్రియా వారియర్ ఒక్క వీడియో తో ఇండియా మొత్తం పాపులర్ అయిపోయింది. తన మొదటి సినిమా ‘ఒరు ఆదార్ లవ్’ సినిమా విడుదలకి ముందే [more]
మలయాళం బ్యూటీ ప్రియా వారియర్ ఒక్క వీడియో తో ఇండియా మొత్తం పాపులర్ అయిపోయింది. తన మొదటి సినిమా ‘ఒరు ఆదార్ లవ్’ సినిమా విడుదలకి ముందే [more]

మలయాళం బ్యూటీ ప్రియా వారియర్ ఒక్క వీడియో తో ఇండియా మొత్తం పాపులర్ అయిపోయింది. తన మొదటి సినిమా ‘ఒరు ఆదార్ లవ్’ సినిమా విడుదలకి ముందే పాపులర్ అయినా ఈ బ్యూటీ ఆ సినిమా సరిగా ఆడకపోవడంతో డీలా పడిపోలేదు. ఆమె క్రేజ్ తో మరిన్ని అవకాశాలు దక్కించుకుంది. సినిమా అవకాశాలే కాదు వాణిజ్య ప్రకటనల్లో కూడా రాణిస్తుంది.
ఇంటర్వ్యూలో…..
అయితే రీసెంట్ గా ఈమెకు ఓ ఇంటర్వ్యూ లో ఓ ప్రశ్న ఎదురైంది. ‘మీకు ఏ హీరో అంటే ఎక్కువ ఇష్టం? ఏ హీరోతో కలిసి నటించాలని వుంది?’ అనే ప్రశ్న ఎదురైంది. సాధారణంగా ఇటువంటి ప్రశ్న వచ్చినప్పుడు ఏ హీరోయిన్ అయినా ” తమకు ఏ హీరో అయినా పర్లేదు” అని చెప్పి సైలెంట్ గా తప్పుకుంటారు.
అందుకే భయం…..
కానీ ప్రియా వారియర్ ఇంకా తెలివిగా తప్పించుకుంది. “ఏ హీరో అంటే ఇష్టం .. ఎవరితో నటించాలనుంది? అనే ప్రశ్నలకి ” నాకు ఈ ప్రశ్న కు సమాధానం చెప్పడం ఇష్టం వుండదు. ఒక హీరో పేరు చెబితే మిగిలిన హీరోల సినిమాల ఛాన్సులు రావు. అందుకే నేను ఏ ఒక్కరి పేరో చెప్పడానికి నేను భయపడుతుంటాను” అని ప్రియా వారియర్ స్పష్టం చేసింది.

