వింక్ గర్ల్.. దేవరకొండని పడేస్తుందా?
మలయాళంలో ఒరు ఆదార్ లవ్ అనే సినిమా ప్రోమో లో కన్ను గీటుతూ.. సోషల్ మీడియాతో ప్రపంచాన్నే తనవైపుకు తిప్పుకున్న ప్రియా ప్రకాష్ వారియర్… ఒరు ఆదార్ [more]
మలయాళంలో ఒరు ఆదార్ లవ్ అనే సినిమా ప్రోమో లో కన్ను గీటుతూ.. సోషల్ మీడియాతో ప్రపంచాన్నే తనవైపుకు తిప్పుకున్న ప్రియా ప్రకాష్ వారియర్… ఒరు ఆదార్ [more]

మలయాళంలో ఒరు ఆదార్ లవ్ అనే సినిమా ప్రోమో లో కన్ను గీటుతూ.. సోషల్ మీడియాతో ప్రపంచాన్నే తనవైపుకు తిప్పుకున్న ప్రియా ప్రకాష్ వారియర్… ఒరు ఆదార్ లవ్ ప్రోమో తో తెగ పాపులర్ అయ్యింది కానీ.. ఒరు ఆదార్ లవ్ సినిమా విడుదలయ్యాక ఆమె అపులారిటీ సోషల్ మీడియాలో తగ్గకపోయినా… హీరోయిన్ గా మాత్రం ఎవరూ పట్టించుకోలేదు. ఒరు ఆదార్ లవ్ తరవాత టాప్ హీరోయిన్ అవుతుంది అనుకుంటే… అడ్రస్ లేకుండా పోయింది. అయితే సినిమాల విషయం పక్కనబెడితే… సోషల్ మీడియాలో అమ్మడు ఫుల్ యాక్టీవ్ గా ఉంటుంది. ఇక ఒరు ఆదార్ లవ్ ప్లాప్ తర్వాత ప్రియా ప్రకాష్ కి బాలీవుడ్ లో శ్రీదేవి బంగ్లా సినిమాతో పాటుగా… తెలుగులో నితిన్ తో కలిసి ఓ సినిమాకి సైన్ చేసింది.
ట్వీట్ చేసి…..
ఇక తాజాగా రౌడీ హీరో విజయ్ దేవరకొండ ని బుట్టలో పడేసే ప్రయత్నాలు స్టార్ట్ చేసినట్లుగా కనబడుతుంది అమ్మడు వ్యవహారం. ఒరు ఆదార్ లవ్ ఆడియో లాంచ్ అప్పుడు అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరోల సరసన ప్లేస్ దక్కుతుందని కలలు కన్న ప్రియా ప్రకాష్… తర్వాత యంగ్ హీరోల చూపు కూడా తన మీద పడకపోయేసరికి తనే ఓ అడుగుముందుకేసి.. తనకి టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ అంటే ఇష్టమంటూ… విజయ్ దేవరకొండ తో డియర్ కామ్రేడ్ ప్రమోషన్స్ అప్పుడు తీయించుకున్న ఓ ఫోటో ని సోషల్ మీడియాలో షేర్ చేసింది. మరి ఆ ఫోటో ని షేర్ చేసిన ప్రియా… నువ్వంటే నాకు చాలా ఇష్టం అంటూ కాప్షన్ పెట్టింది. మరి ఇలా నువ్వంటే ఇష్టం, నీతో కలిసి నటించాలని ఉంది, నువ్వు సూపర్ అంటే విజయ్ దేవరకొండ పడాలిగా..!

