Sun Oct 06 2024 00:18:41 GMT+0000 (Coordinated Universal Time)
బాలయ్యతో బాహుబలి.. త్వరలోనే కొత్త ఎపిసోడ్
ప్రభాస్ సినిమాల్లోని కొన్ని వీడియోలను కలిపి ఓ టీజర్ ను వదిలింది. త్వరలోనే బాలయ్య విత్ ప్రభాస్ ఎపిసోడ్ స్ట్రీమ్..
టాలీవుడ్ టాప్ హీరో నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా లో ప్రసారమవుతున్న షో 'అన్ స్టాపబుల్-2'. కుర్రహీరోలు, సీనియర్ నటులతో పాటు, పొలిటీషియన్స్ తో కూడా బాలయ్య ముచ్చట్లు, సరదా సంగతులు ఆడియన్స్ ను ఆకట్టుకుంటున్నాయి. కొద్దిరోజులుగా ఈ షోకి ప్రభాస్ గెస్ట్ గా వస్తున్నాడంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. ఆ ప్రచారానికి ఫుల్ స్టాప్ పెడుతూ.. ఆహా తాజా ఎపిసోడ్ పై అప్డేట్ ఇచ్చింది.
ప్రభాస్ సినిమాల్లోని కొన్ని వీడియోలను కలిపి ఓ టీజర్ ను వదిలింది. త్వరలోనే బాలయ్య విత్ ప్రభాస్ ఎపిసోడ్ స్ట్రీమ్ అవ్వబోతుందని హింట్ ఇచ్చేసింది. కాగా.. ఈ ఎపిసోడ్ షూటింగ్ పూర్తయిందా లేదా అన్నది మాత్రం ఇంకా తెలియరాలేదు. ఈ ఎపిసోడ్ టెలీకాస్ట్ అయితే.. ఆహా టీఆర్పీ ఎక్కడికో వెళ్లిపోవడం ఖాయం.
Next Story