Sun Dec 08 2024 06:32:35 GMT+0000 (Coordinated Universal Time)
మంచు విష్ణు 'కన్నప్ప' ప్రాజెక్ట్‌లో ప్రభాస్..
మంచు విష్ణు ఇటీవల తన డ్రీం ప్రాజెక్ట్ 'కన్నప్ప'ని మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రంలో ప్రభాస్..
టాలీవుడ్ హీరో మంచు విష్ణు (Manchu Vishnu) ‘భక్త కన్నప్ప’ తన డ్రీం ప్రాజెక్ట్ అంటూ గత కొంత కాలంగా చెప్పుకొస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల ‘కన్నప్ప’ అనే టైటిల్ తో ఆ మూవీని పట్టాలు ఎక్కించాడు. పూజా కార్యక్రమాలతో మొదలైన ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం విదేశాల్లో జరుగుతున్నట్లు సమాచారం. ఇది ఇలా ఉంటే, ఈ మూవీకి సంబంధించిన ఒక ఇంటరెస్టింగ్ న్యూస్ నెట్టింట వైరల్ గా మారింది. అదేంటంటే.. ఈ సినిమాలో ప్రభాస్ (Prabhas) కూడా నటించబోతున్నాడట.
ప్రముఖ మూవీ క్రిటిక్ రమేష్ బాలా.. ఈ విషయం గురించి ఒక ట్వీట్ చేశాడు. "కొందరి నమ్మదగిన వ్యక్తుల నుంచి వచ్చిన సమాచారం ప్రకారం మంచు విష్ణు కన్నప్ప ప్రాజెక్ట్ లో ప్రభాస్ ఒక ఇంపార్టెంట్ రోల్ చేస్తున్నాడు అని తెలుస్తుంది" అంటూ ట్వీట్ చేశాడు. ఇక ఈ ట్వీట్ కి మంచు విష్ణు బదులిస్తూ.. 'హరహర మహాదేవ్' అంటూ రీట్వీట్ చేశాడు. దీంతో ప్రభాస్ నిజంగానే ఈ మూవీలో చేయబోతున్నాడా..? అనే ఆసక్తి అందరిలో మొదలైంది. ఇంపార్టెంట్ రోల్ అంటే శివుడు పాత్ర అయ్యి ఉంటుందని అందరూ కామెంట్స్ చేస్తున్నారు.
మరి ఈ వార్త ఎంత వరకు నిజమో తెలియాలి అంటే కొన్ని రోజులు ఎదురు చూడాల్సిందే. కాగా రెబల్ స్టార్ కృష్ణంరాజు గతంలో ఇదే కథని ‘భక్త కన్నప్ప’గా ఆడియన్స్ ముందుకు తీసుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఆ చిత్రం ఒక కల్ట్ క్లాసిక్ గా నిలిచింది. ఆ మూవీని ప్రభాస్ తో కూడా మల్లి తెరకెక్కించాలని అనుకున్నారు. కానీ అది కుదరలేదు. ఇప్పుడు విష్ణు 'కన్నప్ప'గా ఆ కథని తీసుకు వస్తున్నాడు. మోహన్ బాబు ఈ చిత్రాన్ని దాదాపు 150 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు. బాలీవుడ్ దర్శకుడు ముఖేష్ కుమార్ సింగ్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక విష్ణు సరసన నుపుర్ సనన్ (Nupur Sanon) నటిస్తుంది. పాన్ ఇండియా లెవెల్ లో ఈ మూవీని రిలీజ్ చేయబోతున్నారు.
Next Story